- ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కంభం సమీపంలోని వాసవి పాలిటెక్నిక్ కళాశాల వద్ద అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై... లారీని వెనక నుంచి వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వెళ్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో.. ఉత్తర కోస్తా, యానాంలో.... ఇవాళ, రేపు... ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాఠశాలల్లో పెరుగుతున్న గైర్హాజరు..
రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరు శాతం ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి... సగటున 15 శాతం వరకూ విద్యార్థులు... బడులకు హాజరు కావడం లేదు. పిల్లల హాజరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంకెన్నాళ్లకు సొంత కార్యాలయం!
రాష్ట్రంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన గ్రామ సచివాలయాల భవన నిర్మాణాల పనులు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా తయారయ్యాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. చాలాచోట్ల పంచాయతీ భవనాల్లోనే అరకొర సదుపాయాల మధ్య సచివాలయాలను నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మూడు 'టి'లతో స్వావలంబన.. ప్రపంచనేతగా భారత్!'
వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికతలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించి, ప్రపంచానికి నేతగా భారత్ అవతరించాలని అన్నారు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే కొవిడ్ మహమ్మారి నుంచి మన దేశం బయటపడగలిగిందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐక్యత లేక.. సఖ్యత కానరాక.. పైచేయి కోసం విపక్షాల కుమ్ములాట!