రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. 20,256 శాంపిల్స్ పరీక్షించగా.. 961 స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మంది, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తంగా ఈ రోజు 998 పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18,697కి పెరిగింది.
కొత్తగా 14మంది మృతి
తాజాగా మరో 14 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 232కి చేరింది. గడిచిన 24గంటల్లో కర్నూలులో 5, అనంతపురంలో 3, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 8422మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో 10043 యాక్టివ్ కేసులు ఉన్నాయి.