రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇవాళ కొత్తగా 9742 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,16,003కి చేరింది. మరో 86 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనాతో 2906 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 86725 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 9742 కరోనా కేసులు.. 86 మంది మృతి - covid updates in ap
ap corona
16:07 August 19
రాష్ట్రంలో కొత్తగా 9742 కరోనా కేసులు.. 86 మంది మృతి
24 గంటల వ్యవధిలో 57685 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... రాష్ట్రంలో ఇప్పటివరకు 30.19 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు బులెటిన్ లో పేర్కొంది. తాజాగా వచ్చిన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1399 కేసులు నిర్ధరణ కాగా... అనంతపురం(1123) , పశ్చిమగోదావరి(919), విశాఖ(835),చిత్తూరు (830), కర్నూలు (794), నెల్లూరు ( 755) నమోదయ్యాయి.
ఇదీ చదవండి
Last Updated : Aug 19, 2020, 5:09 PM IST