ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దసరా ప్రత్యేకం..తెలంగాణ నుంచి రాష్ట్రానికి 964 బస్సులు - aps rts

దసరాకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ నుంచి ఏపీకి 964 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 7 వరకు ఈ బస్సులు  ప్రయాణికులకు సేవలందిస్తాయన్నారు.

తెలంగాణ నుంచి రాష్ట్రానికి 964 బస్సులు

By

Published : Sep 24, 2019, 5:10 PM IST

Updated : Sep 24, 2019, 6:01 PM IST

తెలంగాణ నుంచి రాష్ట్రానికి 964 బస్సులు

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ నుంచి ఏపీలోని పలుచోట్లకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు ఈనెల 27 నుంచి వచ్చేనెల 7 వరకు ప్రయాణికులకు సేవలను అందించనున్నాయి. ఈ మేరకు ఏపీలోని పలు ప్రాంతాలకు 964 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక బస్సులలో ఒకటిన్నర రెట్లు అధిక చార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్​లోని సీబీఎస్, ఎంజీబీఎస్, దిల్​సుఖ్​నగర్​లో మే ఐ హెల్ప్​ యూ కౌంటర్ల ద్వారా ప్రయాణికులకు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం కల్పించామన్నారు.

ప్రత్యేక బస్సులు వెళ్లే స్థలాలు
తెలంగాణ (హైదరాబాద్) నుంచి విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు మాచర్ల , గుడివాడ, రాజమండ్రి కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖ, శ్రీకాకుళం, భీమవరం, నరసాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామురు, పొదిలి, కర్నూలు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లెకి ప్రత్యేక బస్సులను నడపనున్నారు..

Last Updated : Sep 24, 2019, 6:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details