ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదు..ఒకరు మృతి - ఏపీ కరోనా కొత్త కేసులు వార్తలు

రాష్ట్రంలో కొత్తగా మరో 94 మందికి కరోనా సోకింది. తాజాగా వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్​లో పేర్కొంది.

covid update
రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదు

By

Published : Jan 15, 2021, 3:22 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 94 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,85,710 కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి... కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.

మొత్తం మరణాల సంఖ్య 7,139కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 232 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,76,372కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,199 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇదీ చదవండి:కరోనా వ్యాక్సినేషన్​కు ఏర్పాట్లు పూర్తి

ABOUT THE AUTHOR

...view details