- చాపకింద నీరులా
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,536 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,67,123కి చేరింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారితో 66 మంది మరణించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సీబీఐకి నివేదిక అప్పగిస్తాం'
అంతర్వేది ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఇప్పటికే ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రశాంతంగా నీట్-2020
రాష్ట్రవ్యాప్తంగా 151 పరీక్ష కేంద్రాల్లో జాతీయ ప్రవేశ పరీక్ష నీట్-2020 ప్రశాంతంగా ముగిసింది. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ... విద్యార్థులు పరీక్ష రాశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వాన కబురు
రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సర్వం సిద్ధం
వర్షాకాల సమావేశాల కోసం పార్లమెంట్ ముస్తాబైంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి ఎన్నో ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. కరోనా పరీక్షలు చేయించుకుని.. అందులో నెగెటివ్ వస్తేనే సమావేశాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పెట్రోలియం ప్రాజెక్టులు ప్రారంభం
బిహార్‌లో నిర్మించిన రూ.900 కోట్ల విలువైన పెట్రోలియం ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక ప్రాజెక్టులను ప్రారంభించటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అమెరికా వల్లే : చైనా
చైనా సైనిక ఆశయాలపై అమెరికా ఇటీవలే ఓ నివేదికను రూపొందించింది. అయితే ఈ విషయంపై చైనా ఎదురుదాడికి దిగింది. వాస్తవానికి అమెరికాతోనే ప్రపంచ శాంతికి ముప్పుపొంచి ఉందని ఆరోపించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎంఎస్ఎంఈలకు ఊతం
లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేందుకు.. అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద బ్యాంకులు రూ.1.63 లక్షల కోట్లు మంజూరు చేశాయి. మొత్తం 42 లక్షల ఎంఎస్ఎంఈలకు.. సెప్టెంబర్ 10 నాటికి ఈ మొత్తాన్ని మంజూరు చేసినట్లు తెలిపింది కేంద్ర ఆర్థిక శాఖ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మాకు నచ్చింది చేస్తున్నాం'
ఐపీఎల్ కోసం ధోనీతో పాటు నెట్ ప్రాక్టీసు చేస్తోన్న వీడియోను పోస్ట్ చేశాడు సీఎస్కే ఆటగాడు షేన్ వాట్సన్. దీంతోపాటు జట్టుతో తనకున్న అనుంబంధాన్ని చెప్పుకొచ్చాడు. ఫ్రాంచైజీ జట్టును నడిపించే విధానం బాగుంటుందన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సమంత మద్దతు
మాదక ద్రవ్యాల కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించడంపై స్పందించింది సమంత. ఆమెకు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.