ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - trending news

.

9 pm top news
ప్రధాన వార్తలు @9pm

By

Published : Jul 4, 2020, 8:58 PM IST

  • సీఎం నివాసం వద్ద కరోనా కలకలం

సీఎం నివాసం వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న 8 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. ఈ నెల 2న సీఎం నివాసం వెలుపల విధుల్లో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కొత్తగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రం‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,962 మంది నమూనాలు పరీక్షించగా 765 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మచిలీపట్నం సబ్​జైలుకు కొల్లు రవీంద్ర

వైకాపా నేత మోకా భాస్కరరావు హత్యకేసులో మచిలీపట్నం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం మచిలీపట్నం సబ్​జైలుకు రవీంద్రను తరలించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 200వ రోజూ ఉద్ధృతంగానే

అమరావతి రైతుల ధర్నా 200వ రోజూ ఉద్ధృతంగా సాగింది. ప్రభుత్వం తమను ఎంతగా అణిచివేయాలని చూస్తే అంతగా ఉద్యమిస్తాని రైతులు తేల్చి చెప్పారు. ఈ పోరాటం తమ కోసం కాదని.. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసమని స్పష్టం చేశారు. వారికి మద్దతుగా కర్నాటక, విదేశాల్లోనూ అన్నదాతలు ధర్నాలు నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వారి నుంచి రూ. 13 కోట్లు వసూలు!

అక్రమంగా ఉపాధ్యాయ వృత్తిలో కొలువు సాధించి, అనర్హతకు గురైన నకిలీ టీచర్లపై దర్యాప్తు చేపట్టిన యూపీ ప్రభుత్వం.. వారి నుంచి రూ.13 కోట్ల రూపాయలను వసూలు చేయనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఈ వందేళ్లలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ఇవే..

కరోనా లాంటి మహమ్మారులు మానవాళికి కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో అంతుపట్టని వ్యాధులు ప్రపంచాన్ని వణికించాయి. అయితే ఎలాంటి వైరస్​కైనా సైన్స్​తో కళ్లెం వేశారు శాస్త్రవేత్తలు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ' ఆ వైరస్ మనుషుల్లో వ్యాపించదు'

చైనాలో కొత్తగా గుర్తించిన స్వైన్​ఫ్లూ జీ4 స్ట్రెయిన్ వైరస్ కొత్తదేమీ కాదని పేర్కొంది చైనా. అందరూ భావిస్తున్నట్లు సులభంగా మానవులు, జంతువులకు సోకదని చెప్పింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'భారత్​పై చైనా డేటా అస్త్రం'

భారత్​కు వ్యతిరేకంగా చైనా సమాచార ఆయుధాన్ని ప్రయోగిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికతను భారతీయులపై నిఘా సాధనాలుగా ఉపయోగించుకుంటోందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'గావస్కర్​ చెత్త ఆటగాడు'

మాజీ క్రికెటర్​ గావస్కర్​కుప్రాక్టీస్​ చేయడమంటే అసలు ఇష్టముండదని చెప్పాడు మాజీ వికెట్​ కీపర్​ కిరణ్​ మోరే. కానీ మ్యాచ్​లో అద్భుతంగా ప్రదర్శన చేయడం అతడిలో ఉన్న ప్రత్యేక ప్రతిభ అని ప్రశంసించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కిరాణా దుకాణం పెట్టిన దర్శకుడు

లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ మూతపడిపోవడం వల్ల దర్శకులు, సినీ తారలు, కళాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమందికి జీవనోపాధి కష్టమైంది. ఈక్రమంలోనే చెన్నైకి చెందిన ఓ దర్శకుడు కిరాణా దుకాణం తెరిచారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details