ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2022, 8:59 AM IST

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

..

9 AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM

  • వైకాపా విజయానికి సైనికుల్లా పనిచేస్తాం... కొత్త మంత్రుల తొలి పలుకులు
    New Ministers Comments: రాష్ట్రంలో నూతన మంత్రి వర్గం కొలువుతీరిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారాల కార్యక్రమం తర్వాత మంత్రివర్గ సభ్యులు మాట్లాడారు. చాలామంది మంత్రులు జగన్​కు రుణపడి ఉంటామని, వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించి బహుమతిగా ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేటి నుంచి పవన్‌ కల్యాణ్ కౌలురైతుల భరోసా యాత్ర
    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కౌలురైతుల భరోసా యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. సత్యసాయి పుట్టపర్తి జిల్లా కొత్తచెరువు నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడాది కాలంలో 28 మంది కౌలు రైతులు మృతి చెందగా, ఆయా రైతుల కుటుంబాలకు పరామర్శించి.... పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • AP New Cabinet : అక్షర క్రమంలో .. అంబటితో మొదలై.. రజనితో ముగింపు
    కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న నాయకుల ముఖాల్లో మెరుపులు... ఆప్తులు, ఆత్మీయుల అభినందనలు... అభిమానులు, కార్యకర్తల కేరింతలు... పదవి కోల్పోయిన మాజీ మంత్రుల ముఖాల్లో కొరవడిన కాంతులు... తప్పనిసరై ఆలింగనాలు... ముక్తసరి పలకరింపులు... ఇవి కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కనిపించిన దృశ్యాలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బండ లాగుడు పోటీలో అపశృతి.. ఎడ్లబండి పైనుంచి కిందపడ్డ ఎమ్మెల్యే
    Bull Competitions in YSR District: వైఎస్ఆర్ జిల్లా దొరసానిపల్లెలో ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీల్లో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. పోటీలను ప్రారంభించే క్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అఫిడవిట్లు ముందుగా జర్నలిస్టులకా?'.. మీడియాపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
    CJI NV RAMANA ON JOURNALISM: అఫిడవిట్లు న్యాయమూర్తుల కంటే మీడియాకే ముందుగా లభిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ అన్నారు. వాటిని జర్నలిస్టులకు ఇచ్చే ముందే.. న్యాయస్థానంలో సమర్పించాలని సూచించారు. కర్ణాటక నుంచి ఇనుప ఖనిజం ఎగుమతులకు అనుమతి మంజూరుపై విచారణ జరిపిన ఆయన.. పరిశోధనాత్మక పాత్రికేయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కొలీజియం అత్యుత్తమ ప్రజాస్వామ్య ప్రక్రియ'
    CJI NV Ramana: కొలీజియం పద్దతికి మించిన ప్రజాస్వామ్య ప్రక్రియలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్​వీ రమణ అభిప్రాయపడ్డారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ స్టీఫెన్​ బ్రేయర్​తో ఆన్​లైన్​ సదస్సులో పాల్గొన్న ఆయన.. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైనా రాజ్యాంగాన్ని అనుసరించి వెళ్లాల్సిందేనని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాక్ ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం.. మోదీ శుభాకాంక్షలు
    Pakisthan New PM: పాకిస్థాన్​లో రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. విపక్షాల మద్దతుతో పాక్‌ నూతన ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్‌ చేయడం వల్ల షెహబాజ్‌ ఎన్నిక లాంఛనమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ గైడ్​లైన్స్​- ఆ ట్రేడింగ్​ సమయం మార్పు
    RBI New Guidelines For NBFCs: రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా.. మధ్య, భారీ స్థాయి బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల కోసం నిర్దిష్ట సూత్రాలు, ప్రమాణాలు, ఇతరత్రా ప్రక్రియలను సోమవారం విడుదల చేసింది. కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నియంత్రణలో ఉండే స్టాక్​ మార్కెట్లలో ఈ నెల 18 నుంచి ట్రేడింగ్‌ ఉదయం 9 గంటలకే ప్రారంభమై, సాయంత్రం 3.30 గంటలకు ముగియనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఛాంపియన్లకు ఏమైంది?.. వరుస ఓటములకు కారణాలు ఇవే!
    Reasons For Mumbai Indians Chennai super kings struggling: ఒకటేమో ఐదు సార్లు ఛాంపియన్‌.. మరొకటేమో నాలుగుసార్లు టీ20 లీగ్ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న జట్టు. అలాంటి టీమ్స్‌ ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడినా బోణీ కొట్టలేక అభిమానులను నిరాశపరిచాయి. ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది కదా ఆ జట్లేవో.. ముంబయి, చెన్నై. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Tollywood: చూడూ..రెండోవైపూ చూడు.. ఇప్పుడిదే మన సినిమాల ట్రెండ్​
    One role two shades upcoming tollywood movies 2022: సినిమాల్లో ఒకప్పుడు ద్విపాత్రాభినయాలు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత ఒకే పాత్రలో రెండు కోణాల్ని ఆవిష్కరించడం ట్రెండ్‌ అయ్యింది. ప్రస్తుతం పలు సినిమాలు ఈ తరహాలోనే రానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details