ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ఏపీ ప్రధాన వార్తలు

...

9 AM Top News
ప్రధాన వార్తలు

By

Published : Sep 21, 2020, 8:59 AM IST

  • సీఆర్డీఏ రద్దు ముమ్మాటికి చట్ట ఉల్లంఘనే..!

అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామని మాటిచ్చి, ప్రత్యేకంగా చట్టం చేసి రైతుల దగ్గర నుంచి భూములు సమీకరించాక.. దానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందు కెళ్లడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. నవనగరాలతో కూడిన రాజధాని కడతామని చట్టబద్ధంగా విశ్వాసం కల్పించి.. అసెంబ్లీ మాత్రమే ఉండే నామమాత్రపు రాజధానినే మిగుల్చుతామనడం ఆ చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాజధానిలో 'రహస్యం' ఏముంది..?

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ ప్రభుత్వ అభియోగాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో... ప్రభుత్వ వర్గాలు బహిరంగంగా ప్రకటించిన తర్వాత జరిగిన కొనుగోళ్లను తప్పుబట్టడంపై న్యాయవాద వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వాదనలో ఏమాత్రం సహేతుకత లేదని.. కక్షసాధింపులా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

కరోనా వ్యాప్తి, లౌక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు ఎట్టకేలకు నేడు తెరుచుకోనున్నాయి. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకానున్నారు. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వెళ్లొచ్చు. 1 నుంచి 8 తరగతుల వారు మాత్రం ఇళ్ల వద్దే ఉండనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా చెరలో పల్లె.. పట్టణాల కంటే ఎక్కువ కేసులు

పల్లెల్లో కరోనా వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గ్రామీణుల్లో అత్యధికులు ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య 67,920 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో పట్టణాల్లో 39శాతం కేసులు ఉంటే గ్రామాల్లో 61శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనాను జయించిన 106 ఏళ్ల బామ్మ

మహమ్మారి కరోనా నుంచి మరో వృద్ధురాలు కోలుకుంది. మహారాష్ట్రకు చెందిన 106 ఏళ్ల బామ్మ... ఆసుపత్రిలో 10 రోజుల చికిత్స అనంతరం కొవిడ్​ నుంచి బయటపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రతిపక్ష పార్టీల సభ్యులపై ప్రివిలేజ్‌ మోషన్​

రాజ్యసభలో గందరగోళం సృష్టించిన ప్రతిపక్ష పార్టీల సభ్యులకు ప్రివిలేజ్‌ మోషన్​ (ప్రత్యేక హక్కుల తీర్మానం) ఇచ్చేందుకు అధికార పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ సమావేశాలు మరింత వాడివేడిగా జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రేపటి నుంచి ఐరాస సర్వ ప్రతినిధి సభ

ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వ ప్రతినిధి సభ ఈ నెల 22 నుంచి 29 వరకు జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ సారి వర్చువల్‌గా సభ నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో దేశాధిపతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ. 97 వేల కోట్ల రుణ ప్రతిపాదనకే ఆ రాష్ట్రాలు ఓటు.

జీఎస్​టీ రెవెన్యూ లోటును పూడ్చేందుకుగాను రూ.97 వేల కోట్ల రుణ ప్రతిపాదనకు 21పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకరించాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. 9 రాష్ట్రాలు.. ఇంకా తమ నిర్ణయాన్ని ప్రకటించలేదని స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సూపర్​ ఓవర్​లో పంజాబ్​పై దిల్లీ ధమాకా

ఉత్కంఠగా సాగిన రెండో ఐపీఎల్ మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. మ్యాచ్​ టై కాగా.. సూపర్​ఓవర్​లో దిల్లీ గెలిచింది. దిల్లీ తరఫున స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగగా.. పంజాబ్ బ్యాట్స్​మన్​ మయాంక్ అగర్వాల్ 89 పరుగులు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రయోగాత్మక చిత్రాలకు గురువు 'సింగీతం'

ఆయన దర్శకత్వంలో నుంచి వచ్చిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. కలం పట్టి అద్భుతమైన రచనలు చేస్తూనే, సంగీతంతో మైమరిపించగలరు. ఆయనే ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ కెరీర్​పై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details