తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు రికార్డులు తిరగరాస్తున్నాయి. ఒక్కరోజులోనే కొత్తగా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి.. 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు.. 1,08,602 మందికి పరీక్షలు నిర్వహించగా.. 8,126 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. మరో 38 మంది మహమ్మారికి బలయ్యారు. 3,307 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 62,929 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణ: కొత్తగా 8,126 కరోనా పాజిటివ్ కేసులు.. 38 మరణాలు - covid news in telangana
తెలంగాణలో ఒక్కరోజులో 8,126 కరోనా కేసులు నమోదయ్యాయి. 38 మంది కొవిడ్ కారణంగా మరణించారు. 3,307 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు
జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,259 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్- 676, రంగారెడ్డి- 591, నిజామాబాద్- 497, నల్గొండ- 346, ఖమ్మం- 339, వరంగల్ అర్బన్- 334, సిద్దిపేట- 306, మహబూబ్‌నగర్- 306, కరీంనగర్-286, జగిత్యాల-264, మంచిర్యాల-233, సంగారెడ్డి- 201 మంది మహమ్మారి బారిన పడ్డారు.