ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై గెలిచెనమ్మ.. 80 ఏళ్ల బామ్మ! - 80 years Grandmother

కరోనాతో పోరాటంలో ఓ 80 ఏళ్ల బామ్మ విజయం సాధించింది. 20 రోజుల పాటు దానితో యుద్ధం చేసి.. తరిమికొట్టింది. తాజా పరీక్షల్లో నెగిటివ్​ రావడం వల్ల ఇంటికి చేరుకుంది.

80-years-grandmother-conquered-the-corona-in-adilabad
80 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది

By

Published : May 10, 2020, 9:54 AM IST

ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. ఈమెకు సెకండరీ కాంటాక్ట్​ ద్వారా వైరస్‌ సోకింది. గత నెల 19న గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 20 రోజుల పాటు చికిత్స పొంది వైరస్‌ బారి నుంచి బయటపడి జిల్లాకు వచ్చింది. రెండ్రోజుల పాటు వరసగా చేసిన నిర్ధారణ పరీక్షల్లో ఫలితాలు నెగిటివ్‌ రావటం వల్ల శనివారం ఆమెను గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసినట్లు ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో తొడ్సం చందు తెలిపారు. కరోనా బారినపడ్డ ఆమె కుమారుడికి గాంధీలోనే చికిత్స కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details