ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

..

7PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Sep 18, 2022, 7:00 PM IST

  • Justice Battu Devanand: రాష్ట్ర రాజధాని ఇదీ... అని చెప్పుకొనే పరిస్థితి ఉందా?
    Justice Battu Devanand : రాష్ట్రంలోని తాజా పరిణామాలపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 స్వాతంత్య్ర భారతావనిలో తెలుగు వారికి ఇదీ రాష్ట్ర రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. బయట వారి వద్ద అవమానాలు ఎదుర్కొనే పరిస్థితికి తెలుగు జాతి చేరిందని ఆవేదన చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లేపాక్షి భూములు రైతులకివ్వాలి.. హిందూపురం పీఎస్​ ఎదుట అఖిలపక్ష నేతల ఆందోళన
    All Party Leaders Protest : హిందూపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట అఖిలపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్ భూముల విషయంలో రిలే నిరాహార దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నేతలు నిరసన బాట పట్టారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టి తీరతామని.. అఖిలపక్షాల నేతలు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏడో రోజు రైతుల మహాపాదయాత్ర.. రెచ్చగొట్టేలా వైకాపా ఫ్లెక్సీలు
    Farmers Maha Padyatra: రాజధాని రైతుల పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. పల్లెలకు పల్లెలు తరలివచ్చి.. అన్నదాతలకు నీరాజనాలు పలుకుతున్నారు. సందడిగా సాగుతున్న రైతుల పాదయాత్ర కృష్ణాతీరంలోని అమరావతి.. సాగరతీరానికి తరలివచ్చిందా అన్నట్లుగా కనిపిస్తోంది. రైతుల పాదయాత్ర ఇవాళ బాపట్ల జిల్లా నగరం నుంచి రేపల్లె వరకు జరిగింది. రైతులు పాదయాత్ర చేసే మార్గంలో వైకాపా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిని శాంతియుతంగా ఎదుర్కొంటామని రైతులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేసీఆర్‌కు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలి: వైఎస్‌ షర్మిల
    YS SHARMILA Fire on KCR: బేడీలు అంటే భయం లేదు.. దమ్ముంటే కేసీఆర్ తనను అరెస్టు చేయాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల సవాల్​ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తాను మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు, తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేరళ సీఎంకు బొమ్మై షాక్.. అన్నింటికీ నో.. ఉత్త చేతులతో తిరిగెళ్లిన విజయన్
    కర్ణాటక పర్యటనలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు నిరాశే ఎదురైంది. పలు ప్రాజెక్టులపై సయోధ్య కుదుర్చుకునేందుకు కర్ణాటక సీఎం బొమ్మైను కలిసిన విజయన్​ ఉత్త చేతులతో తిరిగెళ్లారు. ఏ ప్రాజెక్టుకూ కర్ణాటక అంగీకారం తెలపలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉచితాలపై తగ్గని ఆప్.. తటపటాయిస్తున్న భాజపా.. 2022 బాద్​షా ఎవరో?
    AAP Freebies in Gujarat: గుజరాత్​లో శాసనసభ ఎన్నికలకు మరో కొన్ని నెలల సమయమే ఉంది. ఇప్పుడు దేశమంతా ఆ ఎన్నికల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉచిత పథక హామీలు కురిపిస్తుంటే.. భాజపా మాత్రం సైలెంట్​గా ఉంది. ఉచితాలను కాషాయ పార్టీ వ్యతిరేకిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఆప్ ఉచితాలకు ప్రజలు ఆకర్షితులై ఆ పార్టీకి పట్టం కడతారా? లేదంటే మళ్లీ భాజపాను గెలిపిస్తారా? భాజపా.. ఉచితాలపై తన వైఖరి మార్చుకుంటుందా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 125 సినిమా హాల్స్​లో రాణి అంత్యక్రియలు లైవ్.. 36కి.మీ బారికేడ్లు.. లక్షల మంది ప్రజలు.. ఖర్చు ఎంతంటే..
    UK queen funeral : బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'క్రెడిట్‌ కార్డ్' vs 'బయ్ నౌ పే లేటర్'.. రెండింట్లో ఏది బెటర్?
    పండగలు వచ్చేస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇ-కామర్స్‌ దిగ్గజాలు తమ రాయితీ అమ్మకాల తేదీలనూ ప్రకటించాయి. మరోవైపు కొనుగోలుదారులూ వీటిని నిశితంగా గమనిస్తున్నారు. రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పండగ కొనుగోళ్లు అధికంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు, 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' (బీఎన్‌పీఎల్‌) ప్రధాన పాత్ర పోషించనున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది మనకు అనుకూలమో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సిరాజ్​ ఏం పాపం చేశాడు'.. బీసీసీఐపై నెటిజన్లు ఫుల్​ ఫైర్​!
    ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్​లు ఆడేందుకు సన్నద్ధమవుతోంది టీమ్​ఇండియా. కొవిడ్ కార‌ణంగా ఈ సిరీస్‌కు ష‌మీ దూర‌మ‌వ్వగా.. అత‌డి స్థానంలో ఉమేశ్​ యాద‌వ్‌ను ఎంపిక‌చేశారు. అయితే సిరాజ్‌ను కాద‌ని ఉమేశ్​ను ఎంపిక‌చేయ‌డంపై బీసీసీఐను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రష్మికకు మరో బంపర్​ ఆఫర్​.. బాలీవుడ్​లోనూ తగ్గేదేలే!
    'పుష్ప' సినిమా తర్వాత హీరోయిన్​ రష్మిక.. కెరీర్​లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. బాలీవుడ్​లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మను సూపర్​ హిట్​ మూవీ సీక్వెల్​లో హీరోయిన్​గా తీసుకున్నట్లు తెలిసింది. ఆ సినిమా ఏంటంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details