ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

..

7PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Aug 4, 2022, 6:59 PM IST

  • మార్ఫింగ్‌ లేదని తేలితే.. అత్యంత కఠిన చర్యలు: సజ్జల
    SAJJALA: ఎంపీ గోరంట్ల మాధవ్‌.. నగ్న వీడియోలో ఎలాంటి మార్ఫింగ్‌ లేదని తేలితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే పార్టీ సహించబోదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Ayyannapatrudu: 'నందమూరి కుటుంబం.. జగన్‌లా దోచుకునేది కాదు'
    TDP leader Ayyannapatrudu: జగన్‌లా దోచుకునే కుటుంబం.. నందమూరి కుటుంబం కాదని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. నందమూరి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ విజయసాయిరెడ్డిపై విశాఖ సీపీకి తెదేపా నేతల ఫిర్యాదు చేశారు. గతంలోనూ పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని వాఖ్యలు చేశారని.. ఎన్నికల తర్వాత అసలు పింక్ డైమండ్ లేదంటున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ACB raids: రాష్ట్రంలో ఏసీబీ దాడులు... పలుచోట్ల రికార్డులు స్వాధీనం
    ACB raids: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్‌, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • SRISAILAM: నిండుకుండలా శ్రీశైలం.. గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల
    SRISAILAM: ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ఒక గేటును పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆ బర్త్​డే పార్టీ మనకు వార్నింగ్​ బెల్.. గెలుపు కష్టమే'.. షాతో యడ్డీ!
    శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సిద్ధరామయ్య 75వ బర్త్​డే పార్టీ వేదికగా కాంగ్రెస్​ ఐక్యతారాగం ఆలపించగా.. భాజపా అప్రమత్తమైంది. ఇదే విషయంపై తన అభిప్రాయాల్ని అగ్రనేత అమిత్​ షాకు మాజీ సీఎం యడియూరప్ప నిర్మొహమాటంగా చెప్పారని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బోల్తా పడిన రైలు దగ్గర ఫొటో.. ఒకరు మృతి.. జలపాతం వద్ద మరొకరు..
    జలపాతం వద్ద ఫొటో దిగుతూ ఒకరు గల్లంతైన ఘటన తమిళనాడు దిండిగుల్​లో జరిగింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బిహార్​లో జరిగిన మరో ఘటనలో బోల్తా పడిన రైలు బోగీ వద్ద ఫొటో దిగుతున్న ఇద్దరు యువకులకు హైటెన్షన్​ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైనా దూకుడు.. తైవాన్ లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం
    China Taiwan news: తైవాన్​లోని ఈశాన్య, నైరుతి ప్రాంత జలాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ డాంగ్​ఫెంగ్​ బాలిస్టిక్​ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని తైవాన్​ రక్షణశాఖ సైతం ధ్రువీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెజాన్​లో 'ప్రెషర్ కుక్కర్'​ కొన్నారా? అయితే బీ అలర్ట్​!
    ప్రముఖ ఈ-కామర్స్​ వెబ్​సైట్​ అమెజాన్​లో ప్రెషర్ కుక్కర్ కొన్నారా? అయితే.. ఈ సమాచారం మీకోసమే. నాణ్యత సరిగా లేని కుక్కర్లు అమ్మినందుకు అమెజాన్​కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జరిమానా వేసింది. కస్టమర్లను స్వయంగా సంప్రదించి, ఆ కుక్కర్లను వెనక్కి తెప్పించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీమ్​ఇండియా నయా 'స్వింగ్ క్వీన్'.. బరిలో దిగితే ప్రత్యర్థులు పెవిలియన్‌కే..
    కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న భారత మహిళల క్రికెట్​ జట్టు బౌలర్​ రేణుకా సింగ్ ఠాకూర్.. తన సూపర్ ఫామ్​తో ఆకట్టుకుంటోంది. హిమాచల్‌ ప్రదేశ్​కు చెందిన ఈ ప్లేయర్ టీమ్​ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యర్థి బ్యాటర్లకు అర్థంకాని పజిల్‌‌గా మారి, వికెట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో సోషల్‌ మీడియాలో భువనేశ్వర్‌తో పోలుస్తూ అభిమానులు నయా 'స్వింగ్‌ క్వీన్‌' అంటూ ట్వీట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మిస్​ యూనివర్స్​పై ఉపాసన కేసు.. అసలేం జరిగిందంటే?
    Actress Upasana Singh on Harnaaz Sandhu: మిస్​ యూనివర్స్-2021గా నిలిచిన భారతీయ యువతి హర్నాజ్​ సంధుపై కోర్టులో పిటిషన్ వేసింది ప్రముఖ నటి ఉపాసన. చండీగఢ్​లోని జిల్లా కోర్టులో తన లాయర్ల ద్వారా ఈ చర్యలు తీసుకుంది. అసలు ఏమైందో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details