ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM

..

7PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Jun 29, 2022, 6:58 PM IST

  • జీపీఎఫ్‌ ఖాతాల్లో సొమ్ము విత్ డ్రా.. ఎలా జరిగిందో తెలియదన్న ఆర్థిక శాఖ!
    GPF ACCOUNTS:ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటన పై ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శిని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్​ ఖాతాల నుంచి సొమ్ము విత్ డ్రా కావడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నించారు. దీనికి.. ఇది ఎలా జరిగిందో తెలియడం లేదనీ.. దీనిపై విచారణ చేసి స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రేపటిలోగా ఫ్లాట్లను ఖాళీ చేయాలి.. ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు!
    FREE ACCOMMODATION: హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతిని ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించి.. సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేను చెప్పిన రోడ్డు నిర్మిస్తే.. బురద కష్టాలే ఉండవంటున్న నిట్ విద్యార్థి..!
    Porus Tharu Road project : వర్షాకాలం వచ్చింది.. రోడ్లన్నీ చెరువుల్ని తలపించడం ఖాయం. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారులు స్విమింగ్‌ పూల్స్‌లా మారిపోతాయి. వానాకాలం ఎప్పుడు వచ్చినా ఇదే పరిస్థితి. వర్షాకాలంలో రోడ్లపై వాహనదారులు ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి. ద్విచక్రవాహదారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవ్వడం చూస్తుంటాం. అయితే.. దానికో పరిష్కార మార్గం చూపిస్తున్నాడు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పిల్లల కలల్ని నిజం చేసిన ఓ తండ్రి కథ.. రామోజీ ఫిలింసిటీ డ్రైవర్ సక్సెస్‌ స్టోరీ
    cab driver success story: మనం ఎలా ఉన్నా.. మన పిల్లలు బాగుండాలి అనుకుంటారు తల్లిదండ్రులు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. పిల్లలకు తెలియకుండా వారిని పెంచుతారు. తమ రెక్కల కష్టంతో కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు. బిడ్డలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తారు. ఇలానే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. డ్రైవర్‌గా పనిచేస్తూ తన నలుగురి పిల్లలకు బంగారు భవిష్యత్తునిచ్చారు. వాళ్ల కుటుంబంపై ప్రత్యేక కథనం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అగ్నిపథ్‌'కు దరఖాస్తుల వెల్లువ.. 6 రోజుల్లోనే 1.83 లక్షలు
    Agnipath Scheme: 'అగ్నిపథ్' నియామక పథకానికి విశేష స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో నియామకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన ఆరు రోజుల్లోనే 1,83,000 దరఖాస్తులు వచ్చాయి. జులై 5 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. ఈలోగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దర్జీ​ హత్య'.. భాజపా ఆరోపణ.. కాంగ్రెస్​ 'రాజ ధర్మం' కౌంటర్
    ఉదయ్​పుర్​లో జరిగిన కన్హయ్య లాల్​ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాశవిక చర్యను ముక్తకఠంతో ఖండిస్తున్నారు. దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తున్నారు. రాజస్థాన్​ సర్కారు కూడా ఈ ఘటనను సీరియస్​గా తీసుకుంది. అయితే విపక్షాలు మాత్రం.. కాంగ్రెస్​ సర్కారు నిర్లక్ష్యమే హత్యకు కారణమని విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అన్నతో 'హలాలా'కు మాజీ భార్య నో.. ముఖంపై యాసిడ్​ పోసిన భర్త
    అన్నయ్యతో హలాలా చేయమని మాజీ భార్యపై ఒత్తిడి తెచ్చాడు భర్త. అందుకు ఆమె నిరాకరించినందుకు ముఖంపై యాసిడ్ దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, త్రిపురలోని ఓ కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్​ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కన్హయ్యను చంపిన వారికి పాక్​తో లింకులు.. కరాచీలో 45 రోజులు శిక్షణ
    Udaipur Killing: ఉదయ్​పుర్​లో టైలర్ కన్హయ్య లాల్ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఉద్దరు ప్రధాన నిందితులకు పాకిస్థాన్​తో సంబంధాలు ఉన్నట్లు రాజస్థాన్ హోంమంత్రి వెల్లడించారు. నిందితుల్లో ఒకరు కరాచీలో 45 రోజుల పాటు ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ కేసును తమ చేతుల్లోకి తీసుకున్న ఎన్​ఐఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఇకపై మరింత మజా!
    IPL Extended Two and half months: ఐపీఎల్​లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ ఆటగాళ్లు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు బీసీసీఐ కార్యదర్శి జై షా. లీగ్​ను మరో రెండు వారాలు పొడిగించేలా చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓరి దేవుడా, ఆపండ్రా బాబు.. నేనేం చేసుకోవట్లే: హీరో రామ్​
    Ram potineni Marriage: టాలీవుడ్ కథానాయకుడు రామ్​ పోతినేని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించారాయన. ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details