- నిధుల సేకరణకు రాజధాని భూముల విక్రయానికి సీఆర్డీఏ ప్రణాళిక
నిధుల సేకరణకు రాజధాని అమరావతి భూముల విక్రయానికి సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలివిడతలో 248.34 ఎకరాలను విక్రయించేందుకు నిర్ణయించింది. ఎకరాకు 10 కోట్ల చొప్పున 2480 కోట్ల రూపాయల్ని సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
- ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత..
అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం వైకాపా ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాల వద్దకు వెళ్లేందుకు తెదేపా ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
- ముహూర్తం ఎందుకు.. ఎప్పుడొచ్చినా నేను సిద్ధమే: అయ్యన్నపాత్రుడు
"నేను అజ్ఞాతంలో ఉన్నానని విజయసాయిరెడ్డి అంటున్నారు.. కానీ నేను నర్సీపట్నంలోనే ఉన్నాను" అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.
- ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ విద్యాశాఖ కీలక ఉత్తర్వులు
ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పని చేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
- 'శివసేన బాలాసాహెబ్'గా శిందే వర్గం.. రెబల్ ఎమ్మెల్యేలపై ఠాక్రే చర్యలు
మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతున్న వేళ.. ఠాక్రే శివసేన, శిందే రెబల్ ఎమ్మెల్యేల బృందాలు వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. ముంబయిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయిన శివసేన జాతీయ కార్యవర్గం 6 తీర్మానాలను ఆమోదించింది.
- మార్నింగ్ వాక్ చేస్తుండగా ఢీకొట్టిన బొలెరో.. పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసినా..
మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ వ్యక్తిని బొలెరో వాహనం ఢీకొట్టింది. వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టడం వల్ల తీవ్రగాయాలతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
- భార్యను నాలుగో అంతస్తు నుంచి తోసేసిన భర్త.. అదే కారణమా?
యూపీలో దారుణం జరిగింది. నలుగురితో కలిసి భార్యను నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకి తోసేశాడు ఓ భర్త. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- పసికూనతో టీమ్ఇండియా ఢీ.. తక్కువ అంచనా వేస్తే కష్టమే!
ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ-20 సిరీస్ కోసం.. రోహిత్ శర్మ నేతృత్వంలో టీమ్ఇండియా ఇప్పటికే అక్కడికి వెళ్లింది. ఇదే క్రమంలో హార్దిక్ పాండ్య సారథ్యంలో మరో భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తోంది.
- ఆసక్తిగా పృథ్విరాజ్ 'కడువా' టీజర్.. 'డీజే టిల్లు' సీక్వెల్ అప్డేట్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో పృథ్విరాజ్ 'కడువా', 'డీజే టిల్లు' సీక్వెల్, 'పరంపర' వెబ్‌సిరీస్, 'చార్లీ 777' చిత్రాల సంగతులు ఉన్నాయి.
- 'ఆ నటి వల్లే ఈరోజు నేనీ స్థాయిలో'
కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి, రజనీకాంత్, వెంకటేశ్.. ఇలా స్టార్ హీరోలందరితో పనిచేసిన సీనియర్ నటి వై.విజయ.. తన కెరీర్ గురించి మాట్లాడారు. సీనియర్ నటి విజయశాంతి ఇచ్చిన సలహాతోనే ఆర్థికంగా తన జీవితం సాఫీగా సాగుతున్నట్లు తెలిపారు.
7PM TOP NEWS