- 'ప్రభుత్వ విధానాల కారణంగానే...రైతుల పంట విరామం'
రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే రైతులు పంట విరామం ప్రకటిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ.. రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదన్నారు.
- పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: జగన్
ముఖ్యమంత్రి జగన్ తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇనగళూరులో అపాచీ పరిశ్రమకు భూమి పూజ చేసిన సీఎం.. 15 నెలల్లో 10 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. వికృతమాలలో ఎలక్ట్రికల్, టీసీఎల్, సన్నీ అప్పోటెక్ పరిశ్రమల్ని ప్రారంభించారు.
- 'తెదేపాలో సమస్యల పరిష్కారానికి.. ఆ కమిటీకే బాధ్యతలు'
తెదేపాలో నేతల మధ్య నెలకొన్న విబేధాల పరిష్కారం కోసం చంద్రబాబు ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యలు నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. నేతల మధ్య విభేదాలు, సమన్వయలోపం వంటి సమస్యలు పరిష్కరించేలా కమిటీకి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు.
- పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం... ముళ్లతుప్పల్లో ఆధార్ కార్డులు.. ఇంకా అన్నీ
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోస్టల్ సిబ్బంది అలసత్వం బయటపడింది. ప్రజలకు చేరాల్సిన ఒరిజినల్ ఆధార్ కార్డులు, పెళ్లి కార్డులు, బ్యాంకు పత్రాలు,.. వివిధ ప్రభుత్వ శాఖలకు చేరాల్సిన లేఖలు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి.
- విజయవాడ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం..3 లారీలు దగ్ధం
విజయవాడ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. లారీ బాడీ బిల్డింగ్ చేసే షెడ్డులో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో మూడు లారీలో దగ్ధమయ్యాయి.
- మోదీతో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము భేటీ.. శుక్రవారమే నామినేషన్
అధికార ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ముర్ము నామినేషన్‌పై మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. దిల్లీకి చేరుకున్న ముర్ము.. ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలిశారు.
- శిందే తిరుగుబాటు సక్సెస్!.. బలంగా రెబల్ క్యాంప్.. ఠాక్రేకు ఛాన్స్ ఉందా?
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరింది. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు శిందే క్యాంపునకు చేరుకున్న నేపథ్యంలో.. తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమేనని శివసేన చెబుతుండగా.. ప్రభుత్వం కూలిపోతే విపక్షంలో కూర్చుంటామని ఎన్సీపీ స్పష్టం చేసింది
- మృతదేహం వద్ద బోరున ఏడ్చిన కోతి.. 20 గంటలు పాటు అక్కడే ఉండి..
సాధారణంగా కోతులు అల్లరి పనులు చేస్తాయి. గుళ్ల దగ్గర భక్తులను భయపెడతాయి. అప్పుడప్పుడు చెట్ల కొమ్మలపై అటుఇటూ దూకుతూ వింత చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి. కానీ తాజాగా కర్ణాటకలో ఓ కోతి చేసిన పని వైరల్‌గా మారింది. కల్బుర్గి జిల్లాకు చెందిన శ్యామల అనే మహిళ అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది.
- ట్విట్టర్లో భారీ మార్పు.. ఇకపై 2,500 అక్షరాల వరకు ట్వీట్!
ట్విట్టర్ మనం ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే 280 అక్షరాలు మాత్రమే రాయగలం. అంతకు మించి క్యారెక్టర్లు వాడాలనుకుంటే మరో ట్వీట్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు అలా కాకుండా.. 2500 అక్షరాల వరకు ట్వీట్ చేయొచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ను ట్విట్టర్ అందుబాటులోకి రానుంది.
- త్వరలో నటనకు హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ దూరం.. మాలీవుడ్లోకి మైత్రీ మూవీ మేకర్స్
హాలీవుడ్ అగ్ర నటుడు బ్రాడ్ పిట్.. షాకింగ్ ప్రకటన చేశారు. తన నట ప్రస్థానంలో చివరి దశలో ఉన్నట్లు.. తర్వలో పూర్తిస్థాయిలో సినిమాలకు దూరం కానున్నట్లు ప్రకటించారు. అలాగే టాలీవుడ్లో టాప్ నిర్మాణ సంస్థ.. ఎంట్రీ ఇస్తోంది.