- "ప్రభుత్వం కాగ్‌కు.. తప్పుడు లెక్కలు సమర్పించింది"
రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు.. తప్పుడు లెక్కలు సమర్పించిందని.. తెదేపా నేత జీవీ రెడ్డి ఆరోపించారు. అప్పులను, ఖర్చులను తక్కువ చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రికి పారదర్శకత ఉంటే అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- చిన్నారి గొంతులో కుంకుమ కేసు : డబ్బు కష్టాలు తీరాలని అలా చేశారట..!
ల్లూరు జిల్లాలో మూఢ నమ్మకాలకు చిన్నారి బలైన కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలకు సంబంధించి.. మృతిచెందిన చిన్నారి తండ్రి వేణుగోపాల్, నానమ్మ దొరసానమ్మను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని విచారించారు. తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలనే శాంతి పూజలు చేసి, చిన్నారి నోట్లో కుంకుమ పోసినట్టు చెప్పినట్టు సమాచారం
- "బీసీలను అణగదొక్కాలనే.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు"
వైకాపా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే.. తమ ఇంటి గోడను కూల్చివేశారని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ అన్నారు. అయ్యన్నపాత్రుడిపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. విజయ్ నిరసన దీక్ష చేపట్టారు.
- జూదంలో భార్యను ఓడిన వ్యక్తి.. ఇతరులతో శారీరక సంబంధానికి ఒత్తిడి
జూదంలో భార్యను పందెంగా పెట్టాడు ఓ వ్యక్తి. ఆటలో ఓడిపోయి.. ఆమెను ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు. మరోవైపు, రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళ.. 70 ఏళ్ల కార్డియాలజిస్ట్‌ను మోసం చేసింది. రూ.1.80 కోట్లు కాజేసింది.
- 'సంస్కరణలు ఇప్పుడు నచ్చకపోయినా.. దీర్ఘకాలంలో మేలే'
సంస్కరణలు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేస్తాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోయినా.. కాలం గడిచేకొద్దీ దేశం వాటి లాభాలను అందుకుంటుందని చెప్పారు.
- రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. 'ఫెయిర్ అండ్ లవ్లీ స్కీమ్ నడుపుతున్నారా?'
కాంగ్రెస్ సీనియర్ నేతలు ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఎంపీలపై పోలీసుల దాడులు, అగ్నిపథ్ స్కీమ్ వంటి అంశాలపై రాష్ట్రపతికి నేతలు ఫిర్యాదు చేశారు.
- విపక్షాలకు మరో షాక్.. రాష్ట్రపతి రేసుకు గోపాలకృష్ణ గాంధీ విముఖత
రాష్ట్రపతి అభ్యర్థిగా తాను నిలబడబోనని బంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ స్పష్టం చేశారు. తన పేరును ప్రతిపాదించినందుకు విపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రపతి రేసు నుంచి శరద్‌పవార్, ఫరూఖ్ అబ్దుల్లా తప్పుకోగా.. ఇప్పుడు గోపాలకృష్ణ కూడా విముఖత చూపడం వల్ల విపక్షాలకు మరో షాక్ తగిలినట్లైంది.
- బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం.. 12 మంది మృతి.. 40 లక్షల మంది వరదనీటిలోనే!
బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈశాన్య, ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.
- మారుతీ బ్రెజా 2022 వెర్షన్ బుకింగ్స్ షురూ.. అదిరే లుక్‌లో ఓలా ఎలక్ట్రిక్ కారు
మారుతీ బ్రెజా 2022 వెర్షన్ కారు బుకింగ్స్ మొదలయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూసుకెళ్లేందుకు ఒలా ఎలక్ట్రిక్ ప్రణాళికలు రచిస్తోంది. అన్ని హంగులతో కూడిన సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది
- ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!
రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కొండా', ఎంఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్' సహా పలు ఆసక్తికర చిత్రాలు ఈ వారం థియేటర్లలో విడుదలకానున్నాయి. దాంతో పాటే ఈ వారంలో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేయండి.