ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - ఏపీ ప్రధాన వార్తలు

.

7pm Top news
ప్రధాన వార్తలు @7PM

By

Published : Feb 24, 2022, 6:59 PM IST

  • ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు.. చాలా భయంగా ఉంది: ఉక్రెయిన్​లోని తెలుగు విద్యార్థులు
    రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధ భయాలతో అక్కడి తెలుగువారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రష్యాపై ఈయూ కఠిన ఆంక్షలు.. దౌత్య సంబంధాలకు ఉక్రెయిన్​ స్వస్తి!
    ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగిన రష్యాపై కఠిన ఆంక్షలకు సిద్ధమైంది ఐరోపా సమాఖ్య. యురోపియన్​ దేశాల నేతల ఆమోదం తెలపగానే అమలులోకి తీసుకురానున్నట్లు యురోపియన్​ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డైర్​ లియాన్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోటీని ఎదుర్కొంటూ.. వీలైనంత తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: సీఎం జగన్
    సహకార బ్యాంకుల ద్వారా వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రైతుల ఆదరణ పొందడం ద్వారా డీసీసీబీలు లాభాల బాటలో నడిచేలా చూడాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వివేకా హత్య రక్తపు మరకలు తెదేపాకు అంటించాలని చూశారు: చంద్రబాబు
    ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్​రెడ్డి ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విచారణ సంస్థల్ని సైతం బెదిరించే స్థాయిలో వివేకా హత్య కేసు ముద్దాయిలు ఉన్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సినీ పరిశ్రమపై కక్ష సాధించి ఏం చేస్తారు?: జేసీ ప్రభాకర్‌రెడ్డి
    ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కక్షసాధింపు చర్య వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ పై కక్ష కట్టారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గిడ్డంగిలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
    కడప శివారులోని ఊటుకూరు వద్ద పాత సామానుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటల తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగ అలుముకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'విపక్షాలకు ఆ ధైర్యం లేదు- ఓటు బ్యాంకు పోతుందనే భయం'
    యూపీలో జరిగిన తొలి నాలుగు దశ ఎన్నికల్లో ఓటర్లు భాజపా వైపే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఓట్ల విభజనలో విపక్షాల లెక్క తప్పిందన్నారు. ఈ క్రమంలోనే కుటుంబ పార్టీలపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వార్​ ఎఫెక్ట్​.. మార్కెట్లు ఢమాల్​.. సెన్సెక్స్​ 2700 పాయింట్లు డౌన్​
    ఉక్రెయిన్​- రష్యా యుద్ధంతో దేశీయ స్టాక్​ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్​ ఏకంగా 2,700 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 815 పాయింట్లు కోల్పోయింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అవసరమైతే 9 మందితో వరల్డ్​కప్​ మ్యాచ్​లు
    మహిళల ప్రపంచకప్​పై ఐసీసీ కీలకనిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, తొమ్మిది మందితోనైనా సరే మ్యాచ్​లు నిర్వహించొచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • థియేటర్​లో 'వలిమై' సినిమా.. బయట బాంబు పేలుడు
    అజిత్ 'వలిమై' షో రన్ అవుతున్న సమయంలో ఓ థియేటర్​ బయట బాంబు పేలడం కలకలం రేపింది. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details