- రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 6 వేలకు పైగా కేసులు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,035 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 6,213 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. - బడ్జెట్‌తో రైతులకు ఎలాంటి మేలు జరగదు: చంద్రబాబు
కేంద్రం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరగదని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పేద వర్గాలు, కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్లో చెప్పలేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్లోబల్ టెండర్ ప్రకారమే సరఫరా.. అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదు: మంత్రి సురేశ్
మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే చిక్కి, గుడ్ల పంపిణీపై తెదేపా నేతల ఆరోపణలను మంత్రి సురేశ్ కొట్టిపారేశారు. గ్లోబల్ టెండర్ ప్రకారమే వీటి సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి ఆర్టీసీ ఉద్యోగులు
ఆర్టీసీ ఎండీకి 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అందజేసింది. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని ఐక్య వేదిక నేతలు పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్- సామాన్యులకు నమ్మకద్రోహం!'
కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భారత్‌ను ఆత్మనిర్భర దేశంగా తీర్చిదిద్దేందుకు నిర్మల పద్దు ఉపకరిస్తుందని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. అయితే... ఈ బడ్జెట్ ద్వారా పేదలు, వేతన జీవులకు కేంద్రం నమ్మకద్రోహం చేసిందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేవుడిపై కోపంతో విగ్రహాలు ధ్వంసం- తనవాళ్లకు హాని జరిగిందని...
తమ కుటుంబంపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయని విగ్రహాలను ధ్వంసం చేశాడో యువకుడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'డిజిటల్ రూపీ' కథేంటి? కొత్త కరెన్సీతో లాభాలుంటాయా?
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారత్‌లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ దీన్ని జారీ చేస్తుందని చెప్పారు. దీని చలామణి ఎలా ఉంటుంది? క్రిప్టో కరెన్సీకి, డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి? దీనిపై ప్రతిపక్షాలు ఏం అంటున్నాయి?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ధర చూసి ఆశ్చర్యపోయా: విరాట్ కోహ్లీ
2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంపికైనప్పుడు తనని కొనుగోలు చేసిన ధర చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు మాజీ సారథి విరాట్ కోహ్లీ. తనను తాను ఆర్సీబీలో తప్ప మరే జట్టులోనూ చూడాలనుకోవడంలేదని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐపీఎల్ మెగా వేలం.. తుది జాబితా ఇదే
ఐపీఎల్ 2022 కోసం మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్‌ను అధికారికంగా విడుదల చేసింది బీసీసీఐ. మొత్తం 590 మంది క్రికెటర్లు మెగావేలంలో పాల్గొనబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎక్స్పోజ్ చేసినందుకు కొప్పడ్డారు: మాళవిక
ఓ హిందీ సినిమాలో లిప్‌లాక్‌లు, ఎక్స్పోజ్ చేసినందుకు తన కుటుంబ సభ్యులు చాలా కొప్పడ్డారని చెప్పారు నటి మాళవిక. ఇటీవలే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన ఆమె.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
allocations_for_ap_tg_institutions_Union_budget