- వచ్చే పదేళ్లలో భారత్‌లో 3 ఐసీసీ టోర్నమెంట్లు
వచ్చే పదేళ్లలో భారత్‌లో మూడు ఐసీసీ టోర్నమెంట్లు జరగనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి.. రాబోయే దశాబ్ద కాలానికి సంబంధించిన 8 కొత్త టోర్నీల వివరాలను ప్రకటించింది. వాటికి 12 దేశాలు అతిథ్యమివ్వనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ అసహనం
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ (National SC Commission) అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మత మార్పిడులపై నివేదిక ఇవ్వటంలో జాప్యం చేయటాన్ని తప్పుబట్టింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్‌కు (AP CS) ఆదేశాలు జారీ చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం జగన్‌తో కియా ఇండియా నూతన ఎండీ భేటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్ పార్క్..తన బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా (Kia india new MD meet cm jagan) కలిశారు. కరోనా కష్ట కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిందన్న కియా యాజమాన్యం..ఈ మేరకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్థానిక సంస్థల కౌన్సిల్ తొలి సమావేశాలకు తేదీలు ఖరారు..
స్థానిక సంస్థల కౌన్సిల్ తొలి సమావేశాలను నోటిఫై చేస్తూ పురపాలక శాఖ ఆదేశాలు ఇచ్చింది. తొలి సమావేశాన్ని నవంబర్ 22వ తేదీన చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్తగా 191 కరోనా కేసులు.. 2 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 191 కరోనా కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 2,734 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కర్తార్‌పుర్ కారిడార్ రీఓపెన్- పంజాబ్ నేతల హర్షం
కరోనా కారణంగా మూతబడిన కర్తార్‌పుర్ కారిడార్‌ను (kartarpur sahib corridor).. బుధవారం తిరిగి తెరవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. కేంద్రం నిర్ణయంపై పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీహర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యువతి దారుణ హత్య.. జననాంగాన్ని కాల్చేసి...
డాబ్డీ ఠాణా పరిధిలోని ఓ నాలాలో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని దిల్లీ పోలీసులు ఆదివారం గుర్తించారు. ఆమె ముఖం, జననాంగాన్ని నిందితులు కాల్చేశారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గడ్చిరోలి ఎన్కౌంటర్లో కొత్త ట్విస్ట్- టాప్ కమాండర్ హతం
ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఈనెల 19న జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 27కి చేరింది. తాజాగా నక్సల్ కమాండర్ సుఖ్లాల్ పర్చాకీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'జో బైడెన్‌కు జిన్‌పింగ్ డైరెక్ట్ వార్నింగ్
తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికా (US China latest news) ప్రోత్సహించడాన్ని వ్యతిరేకిస్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ను నేరుగా హెచ్చరించారు (Biden XI meeting) చైనా అధినేత జిన్‌పింగ్. నిప్పుతో చెలగాటమాడుతున్నారని, అలా చేసే వారంతా భస్మమైపోతారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రైవేటు పెట్టుబడులతోనే స్థిరంగా దేశ ఆర్థిక వృద్ధి'
దేశ ఆర్థిక వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikanta Das RBI Governor) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఆర్థికంగా పుంజుకుంటున్నట్లు అనేక గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.