ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM - ఆంధ్రప్రదేశ్ టాప్ న్యూస్

.

7pm top news
ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Aug 3, 2021, 7:00 PM IST

  • డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం
    ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలకు ఇంటర్నెట్​ తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొత్తగా 1,546 కరోనా కేసులు
    రాష్ట్రంలో కొత్తగా 1,546 కరోనా కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 69,606 మంది నమూనాలు పరీక్షించగా 1,546 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,940 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,198 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సెర్చ్ కమిటీలు
    విక్రమ సింహపురి, అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్​ల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు విశ్వవిద్యాలయాలకూ వేర్వేరుగా ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను సమర్పించాల్సిందిగా సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అయోధ్యరామిరెడ్డి వాదనలు
    జగన్ అక్రమాస్తుల కేసులో రాంకీ ఫార్మా ఛార్జ్​షీట్ నుంచి తనను తొలగించాలన్న డిశ్చార్జ్ పిటిషన్​పై రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వాదనలు వినిపించారు. అయోధ్య రామిరెడ్డి తరఫున మరిన్ని వాదనల కోసం విచారణను ఈనెల 12కి కోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కీలక బిల్లులు పాస్
    పార్లమెంట్​లో మంగళవారం కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. గందరగోళ పరిస్థితుల మధ్యే ఉభయ సభలు ఒక్కో బిల్లుకు ఆమోదముద్ర వేశాయి. అనంతరం బుధవారానికి వాయిదా పడ్డాయి. అయితే, సభలో ప్రతిష్టంభనపై వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విపక్షం కలిసి ఈ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆందోళనకరంగా కరోనా ఆర్​-ఫ్యాక్టర్!
    ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా ఆర్​ ఫ్యాక్టర్ ఒకటి దాటిందని కేంద్రం వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని, త్వరలోనే నాలుగు భారతీయ ఫార్మా సంస్థలు టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పోలీసుల షాకింగ్ ప్రకటన
    "మా తర్వాతి టార్గెట్​ ఆ 10 మందే" అంటూ కీలక ప్రకటన విడుదల చేశారు జమ్ముకశ్మీర్ పోలీసులు. ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారి పనిబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రికార్డుల మోత
    స్టాక్ మార్కెట్లలో బుల్​ దూకుడు కొనసాగింది. సెన్సెక్స్ (Sensex Today) 873 పాయింట్లు పెరిగి చరిత్రలో తొలిసారి 53,800 పైన స్థిరపడింది. నిఫ్టీ (Nifty Today) 246 పాయింట్ల లాభంతో.. సరికొత్త రికార్డు స్థాయి అయిన 16,100 మార్క్​ను దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తప్పని నిరాశ!
    భారత పారాలింపిక్స్​ బృందంలో షూటర్​ నరేశ్​ కుమార్​ను చేర్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. ఆయనకు నిరాశ తప్పలేదు. సోమవారంతో టోక్యో ఒలింపిక్స్​ ఎంట్రీల గడువు ముగియడం వల్ల షూటర్​ కోసం అదనపు స్లాట్​ను బుక్​ చేయలేమని టోక్యో పారాలింపిక్స్​ నిర్వాహకులు తెలియజేసినట్లు పారాలింపిక్​ కమిటీ ఆఫ్​ ఇండియా(పీసీఐ) కోర్టుకు విన్నవించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కెరీర్​లోనే రికార్డు ధర!
    రామ్‌ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ RAPO19 వర్కింగ్‌ టైటిల్‌తో శరవేగంగా సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఆడియో హక్కులకు రికార్డు ధర లభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details