1. విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం
విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షల నిర్వహిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏ పరిస్థితిలో, ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరంగా చెప్పాలని అధికారులను ఆదేశించారు. మనబడి, నాడు-నేడుపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. స్విమ్స్‌లో బెడ్ల కొరత.. ఆరు బయటే రోగులకు ఊపిరులూదుతున్న వైద్యులు
చిత్తూరు జిల్లాలోని స్విమ్స్ ప్రాంగణంలో ఎటు చూసినా ఆరు బయట ప్రాణ వాయువు తీసుకుంటున్న హృదయవిదారక సంఘటనలే కనిపిస్తున్నాయి. ఆస్పత్రిలో బెడ్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో స్విమ్స్ వైద్యులు అన్నార్థులకు, రోగులకు ఊపిరులూది ప్రాణాలను కాపాడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'ప్రజలకు అందుబాటులో ఉండండి.. అండగా నిలవండి'
వర్చువల్ విధానంలో కేంద్రమంత్రి మండలి సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కరోనా పరిస్థితిపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రెండు రోజుల పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిలిపివేత
ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే కరోనా నిర్ధరణ పరీక్షలను రెండురోజుల పాటు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజులూ ర్యాపిడ్ యాంటీజన్ కిట్ల ద్వారా మాత్రమే కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. వారం రోజులుగా అపరిష్కృతంగా ఉన్న టెస్టుల బ్యాక్‌లాగ్‌ను పరిష్కరించేందుకు వీలుగా ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.మోదీకి జిన్‌పింగ్ లేఖ- కరోనా కట్టడికి సాయం!
కరోనా రెండో దశ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న భారత్‌కు సాయం అందిస్తామని తెలిపారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. కరోనా ఉద్ధృతిపై సానుభూతి ప్రకటిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.