- రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలి: పవన్
కౌలు రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భూమి దున్నే రైతుల కోసం జై కిసాన్ అనే కార్యక్రమం చేపడతామన్నారు. వ్యవసాయ సీజన్‌లో రైతులు నాలుగుసార్లు నష్టపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్..అవగాహనలేని జీరో సీఎం: చంద్రబాబు
పింఛన్ల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో 44.32 లక్షల పింఛన్లు ఇచ్చినట్లు చెప్పారని.. తెదేపా హయాంలో 50.29 లక్షల మందికి పింఛన్లు అందజేశామని తెలిపారు. జగన్ అవగాహనలేని.. జీరో ముఖ్యమంత్రి అని విమర్శించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సముద్రంలో మత్స్యకారుల మధ్య వివాదం.. బోట్లతో ఛేజింగ్..!
సముద్రంలో సుమారు 15 బోట్లు.. ఒకదాని మీదకి ఒకటి రయ్యిమంటూ దూసుకుపోతున్నాయ్. సముద్రం అల్లకల్లోలమైంది. బోట్లపైనే ఇరువర్గాలు గొడవపడుతూ.. సముద్రాన్ని రణరంగంలా మార్చారు. ఇదేదో సినిమా ఛేజింగ్ ఫైట్ అనుకునేరు..! రెండు వర్గాల మత్స్యకారుల మధ్య సముద్రంలో జరిగిన గొడవ సినిమా ఛేజింగ్‌ను తలపించింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని తీరప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘనపై సుప్రీం ఆందోళన
కొవిడ్ మార్గదర్శకాలు ఉల్లంఘనపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలు కఠినంగా అమలుచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఈ నెలలోనే కరోనా టీకాకు అనుమతులు!'
దేశంలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి ఈ నెల చివరి నాటికి అనుమతులు లభిస్తాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో తయారైన వ్యాక్సిన్లు సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. టీకా సరఫరాకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రజనీ రాజకీయానికి సవాళ్ల స్వాగతం