- తగ్గని విలయం
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,393 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు చేరింది. వైరస్ బారిన పడి మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మహిళల జీవితాన్ని మార్చేందుకే'
వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళా సాధికారితకు మరో 2 సంస్థలు తోడ్పాటు అందించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ రిటైల్ జియో, అల్లాన కంపెనీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ప్రాజెక్టులు నిలుపుదల చేయాలి'
కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని.. వాటిని నిలుపుదల చేసి.. ఏపీ రైతుల హక్కులు కాపాడాలని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి షెకావత్‌కు.. సమాఖ్య అధ్యక్షుడు ఈ - మెయిల్ ద్వారా లేఖ పంపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అనుమతి లేదు'
కరోనా కేసుల దృష్ట్యా విజయవాడ నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి లేదని నగర సీపీ తెలిపారు. ఎవరి ఇళ్లల్లో వారే పూజలు చేసుకోవాలని సూచించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రికార్డు స్థాయిలో ...
దేశంలో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 9.18 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. మొత్తంగా ఇప్పటివరకు 3.26 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసం'