- పోలవరం ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
పోలవరం ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సరిహద్దు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరంపై వాస్తవాలతో కూడిన నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని.. జాతికి అంకితం చేసిన సీఎం జగన్
సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్...ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తూ వస్తున్నామన్న సీఎం... నెల్లూరు జిల్లాలో కరవు మండలమంటూ ఉండకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకున్న ఆంధ్రప్రదేశ్
రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. 18 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. 500 కోట్ల రూపాయల మేర సెక్యూరిటీలను వేలం వేసి, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాన్ని తీసుకుంది. 7.58 శాతం వడ్డీకి ఈ వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మాజీ మంత్రి నారాయణకు సీఐడీ కేసులో ముందస్తు బెయిల్
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ విషయంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణ తదితరులకు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైంది. అభియోగ పత్రం దాఖలు చేసే వరకు దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిల్లీలో వందల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. విలువ రూ. 1200 కోట్లపైనే!
దేశంలో మరొ భారీ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను దిల్లీ పోలీసులు సీజ్ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్(మెథ్) ఉండటం గమనార్హం. దీంతోపాటు 10కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్స్ విలువ రూ.1200కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మాదకద్రవ్యాల దందాను విదేశీయులు నడిపిస్తుండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సినిమా రేంజ్లో ప్రయాణికుడ్ని కాపాడిన రైల్వే పోలీస్.. వీడియో వైరల్