- రాష్ట్రంలో మెరుగైన విద్యావ్యవస్థ కోసం పని చేస్తున్నాం: సీఎం జగన్
ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విద్యా విధానం ఉండాలనే లక్ష్యంతో...మూడేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో గురపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన...టీచర్ల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితి రావాలన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుంటే...ప్రతిపక్షం టీచర్లను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని సీఎం ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెల్లూరు జిల్లాలో దారుణం.. బాలికపై మేనమామ యాసిడ్ దాడి
మేనమామ అంటే.. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన వాడు. భవిష్యత్‌కు దారి చూపాల్సిన వాడు. కానీ కామం మత్తులో మేనకోడలిపైనే కన్నేశాడు. గత కొన్ని రోజులుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది ఎవరికీ చెప్పుకోలేక ఆమె కుమిలిపోయింది. దాంతో అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈరోజు అది శృతిమించి.. ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు కోశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మారణాయుధాలతో దాడి చేస్తే.. నామమాత్రపు కేసులా?: తెదేపా
రౌడీయిజాన్ని నమ్ముకున్నవాళ్లు ఎవరూ బాగు పడలేదని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా నేతల దాడిలో కన్ను కోల్పోయిన చెన్నుపాటి గాంధీని పరామర్శించిన ఆయన.. ఓటమి భయంతోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు దాడిలో పాల్గొన్న వారి నేరచరిత్రను తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రామపంచాయతీ ఉద్యోగుల సమ్మె సైరన్..
తమ డిమాండ్లు సాధించుకునేందుకు గ్రామ పంచాయతీ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. 9 ప్రధాన డిమాండ్లతో పంచాయతీ రాజ్ కమిషనర్‌కు సమ్మె నోటీసు పంపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాహుల్ గాంధీని కలిసిన బిహార్ ముఖ్యమంత్రి.. దాని గురించే చర్చ!
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి గంట పాటు చర్చించారు. వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో కుడా నీతీశ్ సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగానే నీతీశ్.. నాయకులను కలుస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నన్ను ఇరికించాలని చూశారు.. ఆ ఒత్తిడితోనే సీబీఐ అధికారి సూసైడ్'