- అనుమతులు లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్ పరిధిలో పట్టణ ప్రణాళిక అధికారుల అండతో ఓ వ్యక్తి ప్లానుకు విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మించాడు. జీ ప్లస్ త్రీకి అనుమతులు తీసుకోగా, ఇప్పుడక్కడ జీ ప్లస్ ఫోర్ భవనం కన్పిస్తోంది.తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలో ఒకరు నిర్మించిన భవనానికి నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్, పార్కింగ్ స్థలం విడిచిపెట్టలేదు. భవన నిర్మాణ సమయంలో పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ.. చూడనట్లుగా వదిలేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్ సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత ..సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆమె పిటిషన్‌లో వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తితిదేలో అక్రమాలకు పాల్పడుతున్న సూపరింటెండెంట్ సహా ఆరుగురు అరెస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం సూపరింటెండెంట్ సహా ఆరుగురు దళారులను తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో దర్శన టికెట్లు ఇప్పించడంలో అక్రమాలు గుర్తించిన తితిదే విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖలోని తితిదే హెచ్‌డీపీపీ విభాగంలో పనిచేస్తున్న మల్లికార్జునను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎంపీ గోరంట్ల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన మహిళా నేతలు
ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారంపై అఖిలపక్షాల మహిళా నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటివరకు అనేక రూపాల్లో ఆందోళనలు చేసిన మహిళా నేతలు ఈరోజు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. త్వరలోనే దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నాలుగు కేంద్ర మంత్రి పదవులు అడిగితే.. భాజపా అప్పుడు ఒప్పుకోలేదు'
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. భాజపాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో నాలుగు కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలన్న తన డిమాండ్‌ను భాజపా తిరస్కరించినప్పుడే ఇక తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు నితీశ్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత ఆలస్యం.. కారణమిదే