- జగన్‌లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్ పేరు కనిపించేదా..!: చంద్రబాబు
CBN ON NTR HEALTH UNIVERSITY : తెలుగుదేశం ప్రభుత్వం కూడా జగన్‌లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్ పేరు ఎక్కడా ఉండేది కాదని మండిపడ్డారు. తెలుగుజాతికి ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తొలగించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. నిర్మాణానికి తట్ట మట్టి కూడా వేయనివాడు పేర్లు మార్చే నీచ సంస్కృతికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక చెల్లదు: సీఈసీ
CEC ON JAGAN : వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎంపిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన సీఈసీ.. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలని స్ఫష్టం చేసింది. శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పేర్కొంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి.. కార్డు జారీ చేసిన ఏఐసీసీ
Chiranjeevi: ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అని చిరంజీవి సోషల్ మీడియాలో మంగళవారం ఓ ఆడియో ఫైల్‌ను పంచుకున్నారు. దానికి ఎలాంటి క్యాప్షన్ రాయకపోవడంతో.. అది తాను హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలోని డైలాగ్ అని కొందరు.. చిరు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని మరికొందరు అభిప్రాయ పడ్డారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గౌరవం లేదు.. అసభ్యంగా మాట్లాడుతున్నారు.. దళిత సర్పంచ్ ఆవేదన
Sarpanch Met SP: దళితురాలిని కావటంతో తనకు సరైన గౌరవం ఇవ్వకుండా.. అసభ్యంగా మాట్లడుతున్నారని ఓ మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. తనను వివక్షకు గురి చేస్తున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పీఎం కేర్స్ ఫండ్' ట్రస్టీగా రతన్ టాటా.. వారిపై మోదీ ప్రశంసలు
PM Cares fund: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా వ్యాపార దిగ్గజం రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కేటీ థామస్ సహా మరికొందరు ప్రముఖులు చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలో జరిగిన సమావేశానికి వారంతా హాజరయ్యారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి వేట.. గురువారమే నోటిఫికేషన్.. గెలిచే ఛాన్స్ ఆయనకే!
Congress President election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు దశాబ్దాల తర్వాత సోనియాగాంధీ వారసుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్ష పీఠానికి గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ బరిలోకి దిగుతారనే ప్రచారంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ప్రమాదం అంచున పాక్ పసిప్రాణాలు.. అత్తెసరు సాయం మాత్రమే..'
పాకిస్థాన్ వరదలు అక్కడి చిన్నారులకు శాపంగా మారాయి. వందలాది మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలామంది కన్నవారిని కోల్పోయి కనీస వసతులులేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక సంక్షోభం కారణంగా పాక్ ప్రభుత్వం అలాంటి వారిని పూర్తిగా ఆదుకునే పరిస్థితి లేకపోగా..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.20వేల కోట్ల బ్యాంకు స్కామ్.. ఏబీజీ షిప్‌యార్డు వ్యవస్థాపక ఛైర్మన్ అరెస్ట్
వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణం ఎగవేత కేసులో ఏబీజీ షిప్‌యార్డ్ వ్యవస్థాపకుడు రిషి కమలేష్ అగర్వాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. విచారణకు హాజరైన రిషి కమలేష్ అగర్వాల్.. దర్యాప్తునకు సహకరించలేదని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వన్నందున అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా-ఆస్ట్రేలియా రెండో టీ20 టికెట్ విక్రయాలు ఆ రోజే: హెచ్‌సీఏ
జింఖానా గ్రౌండ్‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను రేపు(సెప్టెంబరు 22) విక్రయిస్తామని హెచ్‌సీఏ తెలిపింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తామని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాహుబలి రేంజ్ సినిమాలో బాలయ్య.. దాదాపుగా షూటింగ్ పూర్తి.. కానీ!
నందమూరి బాలకృష్ణ బాహుబలి లాంటి బడా బడ్జెట్ సినిమాలో నటించారట. ఇంచుమించు ఆ చిత్రం కథ కూడా బాహుబలిలానే ఉంటుందట. కానీ అది..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
7am top news