ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news

..

7AM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM

By

Published : Sep 16, 2022, 6:59 AM IST

  • అమరావతి రాజధాని పూర్తి చేయాలంటే వందేళ్లు పడుతుంది: సీఎం జగన్​
    CM JAGAN IN ASSEMBLY : అమరావతి రాజధాని పూర్తి చేయాలంటే వందేళ్లు పడుతుందని.. సీఎం జగన్‌ అన్నారు. అందుకు 20 నుంచి 30 లక్షల కోట్లు పడుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఈ మేరకు సీఎం వెల్లడించినట్లు పీటీఐ కథనం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పైసా ఖర్చు లేకుండా అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా తీర్చిదిద్దుతాం:చంద్రబాబు
    TDLP MEETING : స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతిపై మాట తప్పి మడమ తిప్పింది జగనేనని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ సహా అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేశామని గుర్తుచేశారు. రాజధాని అంశంపై చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమరావతి భూ కొనుగోళ్లపై నేను సిద్ధం.. విశాఖపై ప్రభుత్వం సిద్ధమా?: పయ్యావుల
    Payyavula Keshav : అమరావతి భూ కొనుగోళ్లపై న్యాయ విచారణకు సిద్ధమని తెదేపా నేత పయ్యావుల కేశవ్​ తేల్చిచెప్పారు. విశాఖ భూలావాదేవీలపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. విశాఖలో మూడేళ్ల భూకొనుగోళ్లపై సవాల్ విసిరితే స్పందన లేదని.. రాజధాని ప్రకటన చేశాకే భూములు కొంటే తప్పేంటని అడిగితే స్పందన లేదని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దొంగతనం చేశాను కదా.. నన్ను అరెస్టు చేయాల్సిందే!
    ఓ వ్యక్తి మందుల దుకాణంలోకి ప్రవేశించాడు.. చోరీ చేయాలనేది అతని ఉద్దేశ్యం. మూడు సబ్బులు తీసుకున్నాడు.. కానీ.. తనను ఎవ్వరూ చూడట్లేదని మళ్లీ అక్కడే పెట్టేశాడు.. సిబ్బంది దృష్టి తనపై పడేవరకూ ఆగాడు. వాళ్లు ఎప్పుడైతే తనను చూశారో.. వెంటనే మూడు సబ్బులు దొంగిలించాడు! సెక్యూరిటీ పరిగెత్తుకొచ్చి.. అతన్ని పట్టుకున్నారు. చోరీ చేసినందకు తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేశారు.. కస్టమర్లలో ఒకరు వచ్చి అతను చోరీ చేసిన సబ్బులకు డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. కానీ.. నిందితుడు మాత్రం.. తనను అరెస్టు చేయాల్సిందేనని పట్టుబట్టాడు..! అక్కడున్నవారంతా అతన్ని పిచ్చివాడిలా చూస్తున్నారు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సాయం కాదది.. నా ధర్మం!, కదులుతున్న రైల్లో ప్రసవం చేసిన డా.స్వాతిరెడ్డి
    DOCTOR SWATHI REDDY : వేగంగా దూసుకెళ్తున్న రైళ్లో ఓ మహిళ పురిటి నోప్పులతో ఇబ్బంది పడుతుంది. కానీ ఆ రైలు ఎక్కడ ఆగాదు. మరి ఎలా.. ఈ సమయంలోనే అపద్బంధవురాలిగా ఆదుకుంది ఆ యువతి. తను నేర్చుకున్న విద్య పది మందికి ఉపయోగపడాలన్న నాన్న మాటలను నిజం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కదులుతున్న రైలులో చోరీకి యత్నం.. 15 కి.మీ. వేలాడుతూనే..
    కదులుతున్న రైల్లో నుంచి ఫోన్​ దొంగతనానికి యత్నించి దొరికిపోయాడు ఓ వ్యక్తి. బిహార్​లోని ఖగారియా స్టేషన్​వద్ద కదులుతున్న రైలు కిటికీలో నుంచి ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన ప్రయాణికుడు దొంగ మరో చేయిని పట్టుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టోల్​బూత్ వద్ద ఇద్దరు మహిళల గొడవ.. ఒకరిపై ఒకరు పడి..
    టోల్‌ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళా సిబ్బందిపై మరో మహిళ దాడికి దిగిన ఘటన మహారాష్ట్రలోని పింపాల్‌గావ్‌ టోల్‌బూత్‌ వద్ద జరిగింది. నిఫాద గ్రామం నుంచి పుణేకు ఓ సీఆర్పీఎఫ్ జవాను కుటుంబంతో కలిసి కారులో వెళుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'దాచిపెట్టాల్సిందేమీ లేదు.. పారదర్శకంగానే అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తాం'
    Congress President Election : కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహిస్తామని.. దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు పార్టీ కేంద్ర ఎన్నికల​ కమిటీ అధ్యక్షుడు మధుసూధన్​ మిస్త్రీ. సెప్టెంబర్​ 22న ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల చేస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టెన్నిస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​ సంచలన నిర్ణయం
    Roger Federer Announces Retirement : దిగ్గజ టెన్నిస్​ స్టార్​ రోజర్​ ఫెదరర్​ రిటైర్మెంట్​ ప్రకటించాడు. వచ్చే వారం జరగనున్న లావర్​ కప్​ తనకు చివరి ఏటీపీ ఈవెంట్​ అని ట్విట్టర్​లో వెల్లడించాడు 41 ఏళ్ల స్విస్​ దిగ్గజం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.200కోట్ల కేసు.. బాలీవుడ్​ స్టార్​ నటిపై 6 గంటలు ప్రశ్నల వర్షం
    200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి గురువారం.. దిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఇటీవల పలుమార్లు ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈరోజు ఆమె దిల్లీలోని మందిర్‌మార్గ్‌లోని ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ కార్యాలయానికి వచ్చారు. ఆమెను విచారించేందుకు దిల్లీ పోలీసులు ముందే సుదీర్ఘ ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details