- రెట్టించిన ఉత్సాహంతో.. అమరావతి రైతుల మలివిడత పాదయాత్ర
Capital Farmers Padayatra: రాజధాని అమరావతికి మరణశాసనం లిఖించేందుకు కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వ దమన నీతిపై... రైతులు ఉద్యమ బావుటా ఎగరేసి నేటికి సరిగ్గా వెయ్యి రోజులు. 2019 డిసెంబర్ 17న శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా... ఆ మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రభుత్వ అణచివేతల్ని, నిర్బంధాల్ని, అవమానాల్ని, అక్రమ కేసుల్ని తట్టుకుని... విరామం లేకుండా రాజధాని రైతులు ఉద్యమ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. తెలుగుజాతి తోడుగా వెనక్కి తగ్గేదేలేదంటూ... అమరావతి నుంచి అరసవల్లికి నేడు రెండో విడత మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
- Gudivada Police Station: కొడాలి నాని వ్యాఖ్యలపై తెదేపా ఆగ్రహం.. గుడివాడలో ఉద్రిక్తత
Tension Gudivada Police Station: గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడాలి నానిపై ఫిర్యాదు చేసేందుకు తెదేపా నేతలు ప్రయత్నించగా.. పార్టీ కార్యాలయం వద్ద తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
- Janasena: రాజు మారినప్పుడల్లా.. రాజధాని మారదు: నాదెండ్ల మనోహర్
Nadendala Manohar on farmers padayatra: రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒక రాజధానినే కట్టలేని జగన్.. మూడు రాజధానులను ఎలా కడతారని ప్రశ్నించారు. రాజధాని రైతుల పాదయాత్రకు జనసేన మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
- Rains: వర్షం సృష్టించిన బీభత్సం.. జలదిగ్బంధంలో ఇళ్లు.. నిలిచిన రాకపోకలు
Rains: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు పంటలను నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి గ్రామలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయి.. రాకపోకలు నిలిచిపోయాయి
- ఒకే వేదికపైకి మోదీ, జిన్‌పింగ్, పుతిన్.. యావత్ ప్రపంచం దృష్టి వీరిపైనే..
SCO Summit 2022 : రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్థాన్ ప్రధాన మంత్రులు ఒకే వేదికను పంచుకోనున్నారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న ఎస్సీఓ సదస్సుకు ఈ నేతలంతా హాజరు కానున్నారు.
- 'కశ్మీర్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు..' ఆజాద్ కీలక వ్యాఖ్యలు
Ghulam Nabi Azad Article 370 : జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామంటూ హామీలు ఇస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాయన్నారు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 తిరిగి పునరుద్ధరణ జరగదని స్పష్టంచేశారు. 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పారు.
- ఉక్రెయిన్ ఎదురుదాడులు.. పారిపోతున్న రష్యా సేనలు
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఉక్రెయిన్ సేనలు దాడులు ఉద్ధృతం చేస్తుండగా.. పుతిన్ దళాలు పారిపోతున్నాయి. ఈ విషయాన్ని రష్యా అధికారికంగా అంగీకరించింది.
- తెగ కొనేస్తున్నారు.. పెరుగుతున్న క్రెడిట్ కార్డ్ చెల్లింపులు
క్రెడిట్ కార్డ్‌లు పెరుగుతున్న కొద్దీ వినియోగదార్ల వ్యయాలు కూడా అధికమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా నెలవారీ క్రెడిట్ కార్డ్ వ్యయాలు రూ.లక్ష కోట్లను అధిగమిస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, వినియోగం తిరిగి గాడిన పడుతోందనడానికి ఇదొక నిదర్శనమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- యూఎస్ ఓపెన్ విజేతగా అల్కరాజ్.. నెం.1 ర్యాంకు కైవసం.. నాదల్ రికార్డు సమం
స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్ యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన పోరులో సంచలన విజయం సాధించాడు. ఈ గెలుపుతో దిగ్గజ నాదల్ రికార్డును సమం చేశాడు.
- నేను నాలానే ఉంటా.. పని ద్వారా స్ఫూర్తి కలిగిస్తా : పూజా హెగ్డే
వరుస సినిమాలతో దూసుకుపోతోంది నటి పూజా హెగ్డే. తెలుగులో అగ్ర కథానాయకులతో మంచి హిట్టు చిత్రాల్లో నటించి కుర్రకారు మనసును దోచుకుంది. తాజాగా ఈ అందాల సుందరిని రెండు సైమా అవార్డులు వరించాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. సౌత్ యూత్ ఐకాన్(ఫీమేల్) అవార్డు కూడా పూజానే వరించింది. తనకు ఈ అవార్డులు ఇచ్చినందుకు ఇన్స్టాగ్రామ్ వేదికగా సైమా అవార్డ్స్ జ్యూరీకి ధన్యవాదాలు తెలిపింది. 'యూత్ ఐకాన్ విషయానికొస్తే.. నేను నాలా ఉంటే.. ఫలితం అదే వస్తుంది' అని చెప్పింది. అందరికీ స్ఫూర్తిగా నిలిస్తానని, తన పని ద్వారా స్ఫూర్తి నింపుతానని చెప్పుకొచ్చింది.
ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM
TAGGED:
7AM TOP NEWS