ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM

..

7AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 AM

By

Published : Aug 6, 2022, 6:59 AM IST

  • అందుకే చంద్రబాబుకు నిధులిచ్చాం.. కానీ జగన్​కు ఇవ్వడం లేదు: సోము వీర్రాజు
    Somu veerraju: చంద్రబాబు దార్శనికుడు కాబట్టే రాజధాని నిర్మాణానికి నిధులిచ్చామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. భూములను ఆక్రమించడానికే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రం వల్ల కాదంటే.. పోలవరాన్ని కేంద్రమే కడుతుందని తెలిపారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేడు దిల్లీకి జగన్‌, చంద్రబాబు.. ఎందుకంటే..?
    Jagan Delhi tour: నేడు సీఎం జగన్​ దిల్లీ వెళ్లనున్నారు. విశాఖ నుంచి సాయంత్రం 5.20 గంటలకు సీఎం జగన్​ పయనమవుతారు. మరోవైపు తెదేపా అధినేత జగన్ కూడా దేశ రాజధానికి వెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Childrens nutrition: బాలల పోషణ బలహీనం.. బక్కచిక్కిపోతున్న బాల్యం
    Childrens nutrition: ఉమ్మడి కర్నూలు జిల్లాలో భావితరం బక్కచిక్కుతోంది. పౌష్టికాహార లోపంతో చిన్నారులు బరువు తగ్గి రక్తహీనత బారిన పడుతున్నారు. వారిని గుర్తించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. పౌష్టికాహార పునరావాస కేంద్రం ఖాళీగా ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో బక్కచిక్కిన భావితరం సేవలు అందుకోలేకపోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Jagananna colony's: జగనన్న కాలనీల్లో కరెంట్ సదుపాయం ఎక్కడ?
    Jagananna colony's: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణాలు మౌలిక సదుపాయాల ఊసే లేదు. కొన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించింది. కానీ విద్యుత్తు సదుపాయం కల్పించినా.. గృహావసరాలకు మాత్రం కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Vice president election: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ధన్‌ఖడ్‌ ఎన్నిక లాంఛనమే
    Vice president election: భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక శనివారం జరగనుంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌(71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్‌ మార్గరెట్‌ ఆళ్వా (80) రంగంలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంటు భవనంలో కొనసాగనుంది. ధన్‌ఖడ్‌ ఎన్నిక లాంఛనంగా కనిపిస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Precaution Dose: పది కోట్లు దాటిన ప్రికాషన్‌ డోసుల పంపిణీ
    Precaution Dose: దేశంలో ఇప్పటివరకు పది కోట్లకుపైగా అర్హులు ప్రికాషన్‌ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ‘ఇప్పుడు 10 కోట్ల మంది అధిక రక్షణ కలిగి ఉన్నారు. అమృతోత్సవాల వేళ ప్రధాని మోదీ సారథ్యంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది’ అని మాండవీయ శుక్రవారం ట్వీట్‌ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆమె యోగ్యురాలు. కంగ్రాట్స్‌ సిఖోమ్‌. నువ్వో లెజెండ్‌' హాలీవుడ్ స్టార్ ట్వీట్
    Mirabai Chanu: బర్మింగ్​హామ్ వేదికగా జరుగుతున్న తొలి బంగారు పతకం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుపై హాలీవుడ్‌ స్టార్‌ ప్రశంసలు కురిపించాడు. 'థోర్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ ప్రశంసలు కురిపించారు. ఇందుకు ఆమె యోగ్యురాలు అంటూ కొనియాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • OLA CAR: ఆగస్టు 15న ఓలా కారు ఆవిష్కరణ? భవీష్‌ ట్వీట్‌పై సర్వత్రా ఆసక్తి
    OLA CAR: ఈనెల 15న కొత్త ప్రోడక్ట్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు. దీంతో అదేంటా అని ఆటో వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆరోజు తమ కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రకటిస్తామని భవీష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెజ్లింగ్​లో బజరంగ్​, సాక్షి, దీపక్​కు గోల్డ్​.. అన్షుకు రజతం.. దివ్యకు కాంస్యం
    commonwealth games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తొమ్మిదో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మరో స్టార్ రెజ్లర్ దీపక్ పునియా బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల 86 కేజీల ఫైనల్లో పాకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ ఇనామ్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మలైకా అరోరా మినీ డ్రెస్​.. వామ్మో అంత ధరా!
    Malaika Arora latest photoshoot: ఐటెమ్​ సాంగ్స్ ఫేమ్, బాలీవుడ్​ ఫిట్​ అండ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా.. తన విషయంలో ఏజ్ అనేది జస్ట్ ఏ నెంబర్ అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఆమె తాజా లేటెస్ట్ ఫొటోషూట్​ అదిరిపోయింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details