ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @7AM

..

7AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7AM

By

Published : Aug 5, 2022, 6:59 AM IST

  • ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా.. 2 వేలమంది ప్రొబేషన్‌ నిలిపివేత
    Sachivalayam employees: రెండేళ్ల సర్వీసు పూర్తయి.. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైనా దాదాపు 2,000 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ను పక్కన పెట్టారు. ప్రత్యేకించి కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో ఎక్కువమంది ఉద్యోగులు ప్రొబేషన్‌కు నోచుకోలేదు. ప్రొబేషన్‌ ఖరారు విషయంలో గతంలో వీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే దీనికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Flood help: వరద బాధితులకు అరకొర సాయం.. గతంలో ఇచ్చిన వాటికే కోత
    Flood help: వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అరకొరగానే అందుతోంది. అధిక శాతం విపత్తు నష్టాలకు ఏడున్నరేళ్ల కిందట నిర్ణయించిన సాయాన్నే ఇప్పుడూ ఇస్తున్నారు. కొన్నింటికి కోత పెట్టారు. బాధితులకిచ్చే నిత్యావసరాలనూ తగ్గించేశారు. వంటపాత్రలు, దుస్తులకు రూ.4వేలు ఇవ్వాల్సి ఉన్నా.. పైసా అందలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Pawan kalyan: పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ చేపట్టాలి: పవన్‌ కల్యాణ్‌
    అచ్యుతాపురం సెజ్‌లో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ఎంతమంది ప్రాణాలను హరించిందో ఎప్పటికీ మరచిపోలేమన్నారు. అచ్యుతాపురం సెజ్‌లో సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో.. తెదేపా నేతల ఆగ్రహం
    MP VIDEO VIRAL: సభ్యసమాజం తల దించుకునేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం ఆరోపించింది. నగ్న వీడియో వైరల్ అవుతున్నా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. బుకాయించడం సిగ్గుచేటని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నదిలో చిక్కుకున్న వృద్ధ జంట.. తాళ్లతో కాపాడిన సహాయక సిబ్బంది
    తమిళనాడు ధర్మపురిలో ఓ వృద్ధ జంట కావేరి నదిలో చిక్కుకుపోయింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంతో వాళ్లను రక్షించారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాం గేట్లు ఎత్తివేయడం వల్ల కావేరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశవ్యాప్తంగా 4.24 కోట్ల కేసులు పెండింగ్‌.. సుప్రీంలోనే 71వేలు..
    Kiran rijiju on pending cases: దేశవ్యాప్తంగా 4.24కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు. ఆగస్టు 2 నాటికి సుప్రీంకోర్టులో 71,411 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • liz truss: నాడు తనకు తాను ఓటు వేసుకోని బాలిక.. ఇప్పుడు ప్రధాని రేసులో..
    liz truss: బ్రిటన్‌లో దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ పాఠశాలలో నిర్వహించిన నాటకంలో ఓ బాలిక మార్గరేట్‌ థాచర్‌ పాత్ర పోషించింది. ఆ నాటికలో ఉత్తుత్తి ఎన్నికలు నిర్వహించారు. దానికి ముందు అభ్యర్థులు ప్రసంగించాలి. ఆ బాలిక కూడా అలానే చేసింది.. కానీ, ఒక్క ఓటు కూడా ఆ బాలికకు రాలేదు. చివరికి తన ఓటు కూడా తనకు వేసుకోలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెజాన్​లో 'ప్రెషర్ కుక్కర్'​ కొన్నారా? అయితే బీ అలర్ట్​!
    ప్రముఖ ఈ-కామర్స్​ వెబ్​సైట్​ అమెజాన్​లో ప్రెషర్ కుక్కర్ కొన్నారా? అయితే.. ఈ సమాచారం మీకోసమే. నాణ్యత సరిగా లేని కుక్కర్లు అమ్మినందుకు అమెజాన్​కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జరిమానా వేసింది. కస్టమర్లను స్వయంగా సంప్రదించి, ఆ కుక్కర్లను వెనక్కి తెప్పించాలని ఆదేశించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హర్మన్​ప్రీత్​ హ్యాట్రిక్​ గోల్స్​.. సెమీస్​కు దూసుకెళ్లిన హాకీ టీం
    Commonwealth games 2022: వేల్స్​తో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని చిత్తు చేసిన భారత్​ సెమీఫైనల్​కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Adhurs raghu: హాస్య నటుడు అదుర్స్‌ రఘు ఇంట విషాదం
    హాస్య నటుడు అదుర్స్‌ రఘు (Raghu Karumanchi) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్‌ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావ్ గురువారం తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details