ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news

..

7AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 AM

By

Published : Jul 31, 2022, 6:59 AM IST

  • పడకేసిన పారిశుద్ధ్యం.. విష జ్వరాల విజృంభణ.. కదలని యంత్రాంగం
    వర్షాలొస్తే జ్వరాలు వస్తాయని అందరికీ తెలుసు. జ్వర పీడితులు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారో కూడా యంత్రాంగం వద్ద రికార్డులు ఉంటాయి. ఈ జాబితాల ఆధారంగా జ్వరాల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు చోద్యం చూస్తున్నాయి. తెనాలి, విజయవాడ శివారు గ్రామాల్లో కలుషితనీరు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం, వందల మంది ఆసుపత్రుల పాలవడం ప్రభుత్వ శాఖల అసమర్థతకు నిదర్శనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోట్లు కురిపించిన బార్లు.. తొలి దశలో ప్రభుత్వానికి రూ.258 కోట్ల ఆదాయం
    రాష్ట్రంలో కొత్త బార్లు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. తొలిదశలో 14 జిల్లాల పరిధిలో 344 బార్లకు శనివారం ఈ-వేలం నిర్వహించగా 323 బార్లకు లైసెన్సులు ఖరారయ్యాయి. వీటిద్వారా ప్రభుత్వానికి ర258 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తం 41 బార్లను కోటి రూపాయలకు కంటే ఎక్కువ మొత్తానికి వేలంలో పాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పేదోడికి మళ్లీ పట్టెడన్నం.. అన్నక్యాంటీన్లు తిరిగి తెరుస్తున్న తెదేపా నేతలు
    పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని నిలదీసిన ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్ల నిర్వహణను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో విజయవంతంగా నిర్వహించిన వీటిని.. అధికారంలోకి రాగానే వైకాపా సర్కారు మూసేసింది. ప్రభుత్వం పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసినా.. మేమున్నామంటూ తెలుగుదేశం నేతలు ముందుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యాప్ రుణాలను కట్టడి చేయటానికి ప్రణాళిక రచిస్తున్నాం: డీజీపీ
    యాప్ రుణాలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని డీజీపీ రాజేంద్రనాథరెడ్డి అన్నారు. పోలీసులకు సైబర్ నేరాలను అడ్డుకునే శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ నగదుతో పట్టుబడిన ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
    ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో పశ్చిమ బెంగాల్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ఎమ్మెల్యేల వద్ద పట్టుబడ్డ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలని ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం, విపక్ష భాజపా డిమాండ్‌ చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ''ఐదేళ్లు చేస్తాం.. వెళ్లిపోతాం' అంటే కుదరదు'.. ఆ రాష్ట్రాలకు మోదీ వార్నింగ్!
    పలు రాష్ట్రాలు విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రాలు చెల్లించాల్సిన విద్యుత్‌ వినియోగ బకాయిలు భారీగా పెరిగినట్లు పేర్కొన్న మోదీ.. సాధ్యమైనంత త్వరగా వాటిని చెల్లించాలని కోరారు. ఇది రాజకీయం కాదని... దేశ నిర్మాణానికి సంబంధించి అంశమని మోదీ స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రిషికి ఇక కష్టమే.. 10శాతానికి పడిపోయిన విజయావకాశాలు
    UK PRESIDENT SURVEY: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్ విజయావకాశాలు 10శాతానికి పడిపోయాయి. ఆయనతో పాటు పోటీలో ఉన్న మరో అభ్యర్థి లిజ్ ట్రస్​కు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముదురుతున్న వివాదం.. ట్విట్టర్​పై ఎలాన్​ మస్క్​ కౌంటర్ దావా
    Elon musk twitter deal: టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ట్విట్టర్​ మధ్య వివాదం ముదురింది. ట్విట్టర్​తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి ఎలాన్​ మస్క్​పై కొన్ని రోజుల క్రితం దావా వేసింది. తాజాగా ట్విట్టర్ దావాను సవాలు చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Commonwealth games: మీరాబాయి సరికొత్త చరిత్ర.. కామన్వెల్త్​లో స్వర్ణం
    Commonwealth games meera bai chanu Gold medal: కామెన్వెల్త్​ క్రీడల్లో భారత వెయిట్​లిఫ్టింగ్​ క్రీడాకారులు జోరు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు పతకాలు(రజతం, కాంస్యం) రాగా ఇప్పుడు స్టార్ వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చాను ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. 2018 కామెన్వెల్త్​ క్రీడల్లో భారత్​రు ఇదే మొదటి గోల్డ్​ మెడల్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాలోని నటుడ్ని గుర్తించింది ఆయనే: బాలకృష్ణ
    Balakrishna Award: రవీంద్రభారతిలో సినారె 91వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో నందమూరి నటసింహం బాలకృష్ణ సినారె జీవన సాఫల్య స్వర్ణకంకణం పురస్కారాన్ని అందుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details