- ఏపీలో కొవిడ్ మృతులు 47,228.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినదానికంటే 220 శాతం అధికం
ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో మరణించిన వారి సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా... 220 శాతం అధికంగా నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశంతో... స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా చెల్లించిన ఎక్స్‌గ్రేషియా ద్వారా ఈ విషయం బయడపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రజలపై మరో వడ్డన.. రహదారుల వెంబడి ఖాళీ స్థలాల మార్కెట్ విలువల పెంపు ?
రాష్ట్ర ప్రభుత్వం మరో వడ్డనకు సిద్ధమవుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న స్థలాల మార్కెట్ విలువలు పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సమయాత్తమవుతోంది. ఈ శాఖ ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర రహదారుల శాఖలు, మండల తహసీల్దార్ కార్యాలయాల నుంచి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వీరి ప్రతిపాదనల ఆధారంగా ఎప్పటి నుంచి అమలుచేయాలన్న దానిపై ఉన్నతాధికారులు నిర్ణయాన్ని తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుంటూరులో మంకీఫాక్స్ అనుమానిత కేసు
రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడ్ని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రియుడితో కలిసి విశాఖ చేరుకున్న సాయిప్రియ
విశాఖ బీచ్‌లో కనిపించకుండా పోయి బెంగళూరులో ప్రత్యక్షమైన సాయిప్రియను పోలీసులు విశాఖకు తీసుకొచ్చారు. ఆమెతో పాటు ప్రియుడు రవిని కూడా తీసుకువచ్చిన పోలీసులు ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరిని విచారించారు. పెళ్లి రోజు సందర్భంగా విశాఖ బీచ్‌కు భర్త శ్రీనివాస్‌తో కలిసి వచ్చిన సాయిప్రియ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రియుడు రవితో బెంగళూరుకు వెళ్లి అక్కడ అతనిని పెళ్లి చేసుకుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జస్టిస్ ఖాన్విల్కర్ కష్టపడేతత్వానికి మారుపేరు: సీజేఐ
కష్టపడేతత్వానికి మారుపేరు జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా మూడో స్థానంలో ఉన్న జస్టిస్ ఖాన్విల్కర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భక్తుడికి బంపర్ ఆఫర్.. ప్రసాదం కోసం వెళ్తే చేతిలో రూ.లక్షలు!
కర్ణాటక చామరాజనగర్‌లో ఓ అధికారి తప్పిదం తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారి ప్రసాదానికి బదులుగా పొరపాటున రూ.2.91లక్షలు ఉన్న బ్యాగును ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆన్లైన్లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్.. ఓపెన్ చేసి చూస్తే...
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వస్తువులు కాక వేరే ఏవో పంపించి అప్పుడప్పుడు కస్టమర్లకు షాకిస్తుంటాయి ఈ-కామర్స్ సంస్థలు. తాజాగా మరోసారి అలానే జరిగింది. కొత్త ల్యాప్‌టాప్ వస్తుందని అనుకుంటే ఆ ప్యాకింగ్‌లో వేరే వస్తువులు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు కస్టమర్లు. ఇంతకీ ఏం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ చమురు సంస్థకు భారీ నష్టం.. మళ్లీ పెట్రో బాదుడు తప్పదా?
దిగ్గజ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారీ నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.1992.53 కోట్ల నష్టం వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఇలా నష్టం రావడం 2020 తర్వాత ఇదే తొలిసారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IND vs WI: విజృంభించిన భారత బౌలర్లు.. తొలి టీ20లో విండీస్ చిత్తు
ఫార్మాట్ మారినా టీమ్‌ఇండియా జోరులో మార్పేమీ లేదు. ఆతిథ్య వెస్టిండీస్‌ను ఇప్పటికే వన్డే సిరీస్‌లో మట్టికరిపించిన భారత్.. టీ20 సిరీస్‌నూ ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా పుంజుకుని భారీ స్కోరు సాధించిన రోహిత్ సేన.. బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో విండీస్‌ను సునాయాసంగా చుట్టేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నా సినిమా షూటింగ్‌కే వచ్చి హీరో ఎవరని నన్నే అడిగారు'
Dhanush interview grey man: తమిళ స్టార్ హీరో ధనుష్ తన జీవితంలో జరిగిన అవమానాలను పంచుకున్నారు. తన సినిమా షూటింగ్‌కు వచ్చి హీరో ఎవరని తననే అడిగారని గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
7AM TOP NEWS