ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news

..

7AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 AM

By

Published : Jul 29, 2022, 6:58 AM IST

Updated : Jul 29, 2022, 7:26 AM IST

  • పారదర్శకత అంటేనే గిట్టని పాలకులు.. పోర్టల్‌లో కనిపించని మెజారిటీ జీవోలు !
    పారదర్శకత అంటేనే గిట్టనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన పాలకులు.. గోప్యతకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మెజారిటీ జీవోల సమాచారం ఎవరికీ కనిపించడం లేదు. ఇ-గెజిట్‌ పోర్టల్‌లోనూ అరకొరగానే జీవోలు దర్శనమిస్తున్నాయి. హైకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా.. ప్రభుత్వ పోకడలో మార్పురావడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కష్టకాలంలో ప్రజలను గాలికొదిలేశారు.. బారికేడ్ల చాటున తిరిగితే సమస్యలు తీరుతాయా ?: చంద్రబాబు
    పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను గోదాట్లో ముంచేసి.. ముఖ్యమంత్రి జగన్‌ చేతులు దులుపుకున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం కట్టలేనని చేతులెత్తేసి.. పునరావాసం ప్యాకేజీ తన వల్ల కాదనడం దారుణమని దుయ్యబట్టారు. సీఎం బారికేడ్ల చాటున తిరిగితే ప్రజల సమస్యలు తీరవని.. అర్హులందరికీ పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ద్రవిడ యూనివర్సిటీలో అక్రమమైనింగ్​ను అడ్డుకోండి.. గవర్నర్​కు చంద్రబాబు లేఖ
    చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ చెందిన 1100 ఎకరాల భూముల్లో వైకాపా నేతలు అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసం, వన్యప్రాణుల మృతి వంటి అంశాలపై గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాసిన ఆయన.. మైనింగ్‌ను అడ్డుకొని పర్యావరణాన్ని కాపాడాలని విన్నవించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేడు కాకినాడలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్సార్​ కాపు నేస్తం పథకం నిధులు విడుదల
    CM Jagan Tour: ఇవాళ వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్న సీఎం.. అక్కడే నిధులు విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మంకీపాక్స్‌ కట్టడికి కేంద్రం చర్యలు.. సలహాలు ఇచ్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
    దేశంలో మంకీపాక్స్‌ వ్యాధి వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వ్యాధి కట్టడికి గాను ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు చేయడం, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేస్తుందని తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మతాంతర వివాహం.. కూతురు, అల్లుడిని ఆటో ఢీకొట్టి..!
    కూతురు మతాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. గర్భంతో ఉన్న కూతురిని ఆటోతో ఢీకొట్టి చంపేయాలని చూశాడు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తగ్గిన జీడీపీ వృద్ధి.. ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా?
    US recession news: అమెరికా తాజాగా విడుదల చేసిన త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటు తగ్గుదల నమోదు చేసింది. దీంతో ఆర్థిక మాంద్యంలో పడే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళా సంపన్నురాలిగా రోష్ని నాడార్​.. అపోలో నుంచి నలుగురు!
    Richest Women in India: దేశంలో అత్యంత సంపన్న మహిళల జాబితాను కోటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌-హురున్‌ సంస్థ విడుదల చేసింది. ఆ జాబితాలో హెచ్​సీఎల్ టెక్నాలజీస్ ఛైర్​పర్సన్ రోష్ని నాడార్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. పదేళ్ల కిందట నైకా బ్రాండ్‌ను ప్రారంభించిన ఫల్గుణి నాయర్‌ సొంతంగా ఎదిగిన మహిళల్లో అగ్రపీఠాన్ని అధిరోహించారు. హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ శాశ్వత డైరెక్టర్‌ నీలిమ ప్రసాద్‌ నాలుగో స్థానంలో నిలిచారు. టాప్-100లో అపోలో నుంచి నలుగురు మహిళలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తారుమారైన డబ్ల్యూటీసీ ర్యాంకులు.. వన్డేల్లో భారత్​ మూడో స్థానం సుస్థిరం
    ICC test championship ranking: ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ర్యాంకులు తారుమారయ్యాయి. రెండో టెస్టులో పాకిస్థాన్‌పై 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన శ్రీలంక (53.33%) డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దూసుకెళ్లింది. భారీ ఓటమితో పాకిస్థాన్‌ (51.85%) ఏకంగా ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. మరోవైపు విండీస్‌పై క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో థర్డ్‌ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలకృష్ణకు సోనాక్షి గ్రీన్​సిగ్నల్​ ఇస్తుందా?
    Balakrishna anilravipudi: బాలకృష్ణ-అనిల్​రావిపూడి సినిమా కోసం బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆమెకు కథ వినిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated : Jul 29, 2022, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details