- Smart Cities: స్మార్ట్ సిటీలకు నిధుల గండం..
Smart Cities: రాష్ట్రంలోని స్మార్ట్ సిటీ కార్పొరేషన్లకు సంబంధించిన నిధుల తిరిగి చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో పనుల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాల్లో కలిపి ఇప్పటివరకు రూ.2,798 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు నగరాలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి సుమారు రూ.1,260 కోట్లు రావాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అడగలేవని.. ఆకలి ఆగదుగా!
వరద ప్రాంతాల్లో బాధితులే కాదు... ఒడ్డెక్కి ఏటి గట్లపైకి చేరిన మూగజీవాలూ ఆకలితో నకనకలాడుతున్నాయి. డొక్కలెండుతున్న పశువుల్ని చూసి రైతులు బాధతో కుంగిపోతున్నారు. మేత కోసం పరుగులు తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- jagananna colonies : జగనన్న ‘జల’కాలనీలు..చినుకుపడితే చెరువులే
jagananna colonies : చిన్నపాటి వర్షానికే కొన్ని చోట్ల జగనన్నకాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోజుల తరబడి వాన నీరు నిలిచి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. రూ.కోట్లు పోసి మెరక పనులు చేసినా చాలాచోట్ల ఫలితం లేకుండా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేను చేయాల్సింది చేస్తున్నాను.. ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి: సీఎం జగన్
CM Jagan Review: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు సహా ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల ఆశీస్సులు తిరిగి పొందేలా ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యేలను సీఎం కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అరెస్టులపై స్టే విధించాలంటూ మరోసారి సుప్రీం మెట్లెక్కిన నుపుర్ శర్మ
Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలం సృష్టించిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తన అరెస్టులపై స్టే విధించాలంటూ ధర్మాసనాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘మీ స్థానంలో పురుషులను ఉద్యోగాలకు పంపండి’.. మహిళా ఉద్యోగులకు తాలిబన్ల హుకుం
Afghan: తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి మహిళా ఉద్యోగులకు తాలిబన్లు తాజాగా ఓ హుకుం జారీ చేసినట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో కొత్త వైరస్ పంజా.. ఆ దేశంలో ఇద్దరు మృతి
Marburg Virus: ఆఫ్రికాలోని ఘనా దేశంలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇటీవలే మరణించిన ఇద్దరి నమూనాలు పరీక్షించగా 'మర్బర్గ్' వైరస్‌గా నిర్ధరణ అయ్యింది. ఎబోలా వైరస్ మాదిరిగానే ఇది కూడా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆఫ్రికా దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '8 ఏళ్లలో రూ.8.6 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు'
NPAs:ఆర్‌బీఐ, ప్రభుత్వం కలిసి తీసుకున్న పటిష్ఠ చర్యల వల్ల ప్రభుత్వం గత 8 ఆర్థిక సంవత్సరాల్లో రూ.8.6 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలయ్యాయని కేంద్రం తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో సుదీర్ఘకాలంగా నిరర్ధక ఆస్తుల కింద వర్గీకరించిన బకాయిలను వసూలు చేసేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం ఎప్పటికప్పుడు బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చింకీ-మింకీ.. ఈ ట్విన్ సిస్టర్స్ ఏం చేసినా స్పెషలే!
Chinki Minki: చింకీ మింకీ.. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్లకు వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకున్న కవలల రూపానికి కాస్త సృజనాత్మకత జోడించి సమయ స్ఫూర్తితో కామెడీ చేస్తూ సోషల్‌మీడియా స్టార్స్‌గా ఎదిగారు. కామెడీ పంచ్‌లతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించే ఈ ట్విన్ సిస్టర్స్.. లేటెస్ట్ ఫొటోషూట్‌పై ఓసారి లుక్కేద్దాం. అలానే వీరి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 7 AM