ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM

..

7AM TOP NEWS
7AM TOP NEWS

By

Published : Jul 2, 2022, 6:57 AM IST

  • AP Crime News: విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి.. భర్త చేతిలో భార్య హత్య
    రాష్ట్రవ్యాపంగా జరిగిన వేర్వేరు ఘటనలో నలుగురు చనిపోయారు. ప్రకాశం జిల్లాలో రొయ్యల చెరువు వద్ద విద్యుధాఖాతంతో ఇద్దరు కూలీలు చనిపోగా.. శ్రీకాకుళం జిల్లాలో భార్య.. భర్త చేతలో హత్యకు గురైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రయాణికులపై ఆర్టీసీ బాదుడు..‘మూడేళ్లలో’ మూడోసారి
    వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపు అడ్డూ అదుపూ లేకుండా సాగిస్తూ ప్రయాణికుల నడ్డివిరుస్తోంది. జగన్‌ సర్కారు అధికారం చేపట్టిన 5 నెలలకే ఛార్జీల మోత మోగించగా.. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌ 14న డీజిల్‌ సెస్‌ పేరిట ఓసారి పెంచింది. తాజాగా మరోసారి డీజిల్‌ సెస్‌ పేరిట బాదేసింది. మొత్తంగా మూడు దఫాలుగా ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై ఏటా దాదాపు 2 వేల కోట్ల రూపాయల మేర భారం పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసు... వెంకటేష్‌కు బెయిల్
    సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంలో సీఐడీ అరెస్టు చేసిన తెదేపా కార్యకర్త గార్లపాటి వెంకటేష్‌కు బెయిల్ మంజూరైంది. వెంకటేష్ ను రిమాండ్ కు పంపాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి న్యాయమూర్తి... ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సొంతపూచీపై వెంకటేషకు బెయిలిచ్చారు. సిఐడీ అధికారులు కుట్రపూరితంగా వెంకటేష్ పై కేసు పెట్టారని... దీనిపై ప్రైవేటు కేసు వేయనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ‘కాగ్‌’తున్న తుది లెక్కలు..పీఏజీ అధికారులపైనే చూపు..!
    ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక లెక్కల చిక్కులు తేలేనా? అన్ని ఆర్థిక మాయలు దాటుకొని అసలు లెక్కలు వెలుగులోకి వచ్చేనా? పీడీ ఖాతాల మాయాజాలంలోని అసలు గుట్టును కాగ్‌ అధికారులు తేల్చి నిఖార్సయిన లెక్కలు ఖరారు చేయనున్నారా? ఇంతవరకు ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (పీఏజీ) కార్యాలయంలో ఉన్నతాధికారుల బదిలీల నేపథ్యంలో కాగ్‌ కురిపించిన ప్రశ్నల పరంపర కొనసాగేనా? కార్పొరేషన్ల రుణాల లెక్కలు అధికారికంగా వెలుగులోకి వచ్చేనా?... ఈ ప్రశ్నలకు కాగ్‌ తుది లెక్కల నుంచే సమాధానం లభించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రూ.350 లంచం కేసు'.. 24ఏళ్ల క్రితం విధించిన శిక్షను కొట్టివేసిన హైకోర్టు
    24 ఏళ్ల క్రితం ఓ పోలీసు అధికారికి దిగువ కోర్టు విధించిన ఏడాది జైలు శిక్షను బాంబే హైకోర్టు కొట్టివేసింది. రూ.350 లంచం తీసుకున్నట్లు 1988లో ఓ పోలీసు అధికారిపై కేసు నమోదైంది. ఫిర్యాదుదారు నుంచి అతడు తీసుకున్న సొమ్ము లంచమే అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మానవరహిత యుద్ధ విమానం.. డీఆర్​డీఓ ప్రయోగం సక్సెస్​
    సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో.. భవిష్యత్తు యుద్ధాలు కేవలం యంత్రాల మధ్యే జరుగుతాయని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని సూపర్‌ పవర్‌ దేశాలు ఇప్పుడు మానవరహిత యుద్ధ వాహనాలపై దృష్టిపెట్టాయి. భారత్‌ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) మూడు అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేసింది. ఇటీవల వాటిని విజయవంతంగా పరీక్షించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పుతిన్​కు మోదీ ఫోన్​! ఆ​ అంశంపైనే సుదీర్ఘ చర్చ
    Modi Putin phone call: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​తో ఫోన్​లో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ సమస్యను సంప్రదింపులు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కారించుకోవాలన్న తమ వైఖరిలో మార్పులేదని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Suchitra Ella : దక్షిణాది రాష్ట్రాలకు.. సుచిత్ర ఎల్ల సూచన !
    దక్షిణాది రాష్ట్రాలు సత్వర వృద్ధి సాధించేందుకు సీఐఐ - దక్షిణ ప్రాంత ఛైర్‌పర్సన్‌ సుచిత్ర ఎల్ల పలు సూచనలు చేశారు. సత్వర వృద్ధి సాధించటం లక్ష్యంగా.. అనువైన వ్యాపార రంగాలను ఎంపిక చేసుకుని, భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేయాలన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IND vs ENG TEST MATCH : చెలరేగిన పంత్, జడేజా.. తొలి రోజు ఆట ముగిసే సరికి..
    IND vs ENG TEST MATCH : ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదోటెస్టు మ్యాచ్​లో తొలిరోజు ఆట ముగిసింది. రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగిన వేశ.. భారత్ ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అందరి గురి 'సంక్రాంతి'పైనే.. 'మెగా154' సహా..
    Sankranthi Movies 2023: సంక్రాంతి అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ సమయంలో ఏ సినిమా విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయి. అందుకే 2023 సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం 'మెగా 154'.. సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైంది. దాంతో పాటు రేసులో ఇంకా ఏ సినిమాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details