తెలంగాణలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో 7,754 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి మరో 51 మంది మృతిచెందారు. 77,930 మందికి నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి మరో 6,542 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో క్రీయాశీల కేసులు 78 వేలు దాటాయి. ప్రస్తుతం 78,888 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో కొత్తగా 1,507, మేడ్చల్ జిల్లాలో 630, రంగారెడ్డి జిల్లాలో 544 కరోనా కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.