ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 6, 2020, 5:26 PM IST

ETV Bharat / city

తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎంసెట్​ ఇంజినీరింగ్ ఫలితాలను ఆ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్షలో 75.29 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 1.43 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... 1.19 మంది పరీక్షకు హాజరయ్యారు. 89,734 మంది ఉత్తీర్ణత సాధించారు.

75 dot 29 percent pass in emcet engineering
తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎంసెట్​ ఇంజినీరింగ్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్షలో 75.29 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 1.43 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... 1.19 మంది పరీక్షకు హాజరయ్యారు. 89,734 మంది ఉత్తీర్ణత సాధించారు.

అర్హులైన విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి కళాశాలలో.. మంచి కోర్సులను ఎంచుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయి ఉండేదనీ... కానీ ఈ సంవత్సరం మొదటి పది స్థానాల్లో బాలురు నిలిచారని అన్నారు.

వారణాసి సాయి తేజ మొదటి ర్యాంకు సాధించగా... యశ్వంత్​ సాయి రెండో ర్యాంకు, తమ్మని మణివెంకట కృష్ణ మూడో ర్యాంకు సాధించినట్లు సబిత పేర్కొన్నారు. . కొవిడ్​ కారణంగా హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details