ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సివిల్స్‌ ఇంటర్వ్యూకు 75 మంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు! - సివిల్స్‌ ఇంటర్వ్యూకు 75 మంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు

సివిల్‌ సర్వీసెస్‌ ప్రధాన పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ మంగళవారం విడుదల చేసింది. ఇంటర్వ్యూకు ఏపీ, తెలంగాణ అభ్యర్థులు 75 మంది వరకు ఎంపికైనట్లు... నిపుణులు అంచనా వేస్తున్నారు.

civil services interview
civil services interview

By

Published : Mar 24, 2021, 7:38 AM IST

సివిల్‌ సర్వీసెస్‌ ప్రధాన పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 2,047 మందిని యూపీఎస్‌సీ ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. వీరిలో ఏపీ, తెలంగాణ అభ్యర్థులు 75 మంది వరకు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఇంటర్వ్యూల ప్రారంభ తేదీలను కమిషన్‌ ఇంకా వెల్లడించలేదు. ఈ ఏడాది సివిల్‌ సర్వీసెస్‌లో 796 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details