High Court : గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న సౌర , పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మేరకు చెల్లించాల్సిన సొమ్ము బకాయిలు మొత్తం రూ. 7,404 కోట్లని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి హైకోర్టుకు నివేదించారు. ప్రస్తుతం రూ.14వందల కోట్ల బకాయిలను సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు జమ చేశామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. గతంలో హైకోర్టు పీపీఏల్లో నిర్ణయించిన మేరకు సోలార్ యూనిట్ కు 4.84 రూపాయలు , పవన విద్యుత్ యూనిట్ కు 5.99 రూపాయలు చొప్పున సొమ్మును చెల్లించాలని పేర్కొంటూ.. ఈ ఏడాది మార్చి 15 న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆరు వారాల్లో బకాయిలు చెల్లించాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. బకాయిలు చెల్లించలేదంటూ.. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేశాయి.
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వ బకాయిలు రూ. 7,404 కోట్లు - discom
High Court గత ప్రభుత్వం చేసుకున్న కోనుగోలు ఒప్పందాల మేరకు చెల్లించాల్సిన సోమ్ము సుమారు రూ. 7,404 కోట్లని విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ తరఫు న్యాయవాది తన నివేదనలో తెలిపారు. ప్రస్తుతం 14వందల కోట్ల బకాయిలను సౌర, పవన విద్యుత్ బకాయిలను జమ చేశామన్నారు.
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు 7,404 కోట్లు