ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Corona cases in TS: తెలంగాణలో మరో 710 మందికి కరోనా.. నలుగురు మృతి - telangana corona cases

తెలంగాణలో తాజాగా 710 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం 10,101 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

tg
tg

By

Published : Jul 15, 2021, 9:44 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.81 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,10,355 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 710 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,27,400కి చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,695కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 808 మంది కోలుకోవడం ద్వారా కోలుకున్న వారి సంఖ్య 6,11,843కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,101 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

తాజా కేసుల్లో..

ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 32, జీహెచ్​ఎంసీ 71, జగిత్యాల 19, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 12, జోగులాంబ గద్వాల 3, కామారెడ్డి 3, కరీంనగర్ 34, ఖమ్మం 80, కుమురం భీం ఆసిఫాబాద్ 5, మహబూబ్​నగర్ 9, మహబూబాబాద్ 21, మంచిర్యాల 47, మెదక్ 5, మేడ్చల్-మల్కాజిగిరి 26, ములుగు 14, నాగర్​కర్నూల్ 7, నల్గొండ 52, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 7, పెద్దపల్లి 46, రాజన్న సిరిసిల్ల 19, రంగారెడ్డి 29, సంగారెడ్డి 10, సిద్దిపేట 25, సూర్యాపేట 28, వికారాబాద్ 4, వనపర్తి 8, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 51, యాదాద్రి భువనగిరిలో 22 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై... రేపు గెజిట్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details