తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆస్పత్రిలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ అయింది. ఇటీవల ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
సికింద్రాబాద్ గాంధీలో కరోనా కలకలం.. 70 మంది వైద్యులు, సిబ్బందికి వైరస్ నిర్ధరణ - గాంధీ ఆస్పత్రి డాక్టర్లకు కరోనా
తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపంది. ఆస్పత్రిలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ అయింది.
gandhi-hospital
గాంధీలో ఆపరేషన్లు నిలిపివేత..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గత వారం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత మంగళవారం నుంచే గాంధీలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. అత్యవసర శస్త్ర చికిత్సలు మాత్రమే చూస్తున్నారు.
ఇదీ చదవండి