రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 6,096 కేసులు, 20 మరణాలు
18:49 April 16
రాష్ట్రంలో కొత్తగా 6,096 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. వైరస్ బారిన పడి మరో 20 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,710 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో తొలిసారి కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,096 కరోనా కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,48,231 మంది వైరస్ బారినపడ్డారు. వైరస్ సోకి చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందగా.. అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, కడప, కృష్ణాజిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. కొవిడ్ నుంచి మరో 1,745 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,710 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా 35,741 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి