ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravathi: న్యాయస్థానం టూ దేవస్థానం.. - అమరావతి ఉద్యమం తాజా సమాచారం

అమరామతి ఉద్యమం 600 రోజులకు చేరుకోనున్న నేపథ్యంలో రాజధాని పరిరక్షణ సమితి తన కార్యచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆదివారం రోజున హైకోర్టు నుంచి మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

Amravati movement
అమరావతి ఉద్యమం

By

Published : Aug 6, 2021, 12:44 PM IST

రాజధాని ఉద్యమం 600 రోజుల సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి కార్యాచరణ ప్రకటించింది. ఆదివారం రోజున 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. హైకోర్టు నుంచి మొదలయ్యే ర్యాలీ... మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి గుడి వరకు సాగుతుందని పరిరక్షణ సమితి నేతలు తెలిపారు. రోడ్లు తవ్వేస్తూ రాజధాని ప్రాంతాన్ని నాశనం చేసే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. ప్రభుత్వం మొండి పట్టుదల వీడి, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details