సీఎం గారూ అమరావతినే వద్దంటున్నారు.. నిధులు దేనికోసం? - అమరావతిలో రైతుల ఆందోళనల వార్తలు
అమరావతి అభివృద్ధిని నిలిపివేసిన ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని దేని కోసం నిధులు అడుగుతున్నారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరు, మందడం, వెలగపూడి సహా పలు గ్రామాల్లో 60వ రోజూ ధర్నాలు చేస్తున్నారు. తుళ్లూరులో 60వ రోజు పోరాటాన్ని పురస్కరించుకుని 60 మంది మహిళలు దీక్షకు కూర్చుకున్నారు. జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
60 womens initiate for Amravati in thulluru