Krishna Board : కృష్ణా బోర్డు అనుమతుల నుంచి 6 ప్రాజెక్టులకు మినహాయింపు
Krishna Board : కృష్ణా ప్రాజెక్టులకు ఏడాదిలోపు అనుమతులు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య నిర్వహణ మండలి పెట్టిన ఆంక్షలను కేంద్రం సడలించింది. సంబంధిత క్లాజ్‌ల నుంచి 6 ప్రాజెక్టులకు మినహాయింపునిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
Krishna Board
Krishna Board : ఇప్పటి వరకు అనుమతులు తీసుకోని కృష్ణా ప్రాజెక్టులకు ఏడాదిలోపు అనుమతులు తీసుకోవాలని, లేదంటే వాటి నిర్వహణను బంద్ చేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య నిర్వహణ మండలి పెట్టిన ఆంక్షలను కేంద్రం సడలించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 6 ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నోటిఫికేషన్‌లోని సంబంధిత క్లాజ్‌ల నుంచి మినహాయింపునిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేని ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
- హంద్రీనీవా ఎత్తిపోతల: పంప్‌హౌస్, అనుబంధ పనులు
- తెలుగు గంగ ప్రాజెక్టు: టీజీసీ హెడ్ వర్క్స్
- గాలేరు నగరి: హెడ్‌వర్క్స్, దాని అనుబంధ పనులు
- వెలిగొండ: హెడ్‌రెగ్యులేటర్, టన్నెల్, అనుబంధ పనులు, నల్లమల సాగర్
- కల్వకుర్తి ఎత్తిపోతల: పంప్‌హౌస్, అనుబంధపనులు ,కల్వకుర్తి ఎత్తిపోతల -అదనపు 15 టీఎంసీలు: పంప్‌హౌస్, అనుబంధ పనులు
- నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం: పంప్‌హౌస్, అనుబంధపనులు