తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర మంత్రి ఈటల వెల్లడించారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులను అధికారులు హోం క్వారంటైన్లో ఉంచారని పేర్కొన్నారు. ఈనెల 14న మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ వ్యక్తి దిల్లీ వెళ్లి, 17న ఆ వ్యక్తి తిరిగి హైదరాబాద్ వచ్చినట్లు వివరించారు.
మార్చి 20న వ్యక్తికి తీవ్ర జ్వరం ప్రారంభమైంది. శ్వాస తీసుకోవడంలో వ్యక్తికి ఇబ్బంది మొదలైంది. బాధితుడికి సైఫాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. గురువారం రాత్రి వృద్ధుడి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే సమీప కార్పొరేట్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సైఫాబాద్ పోలీసుల సాయంతో మృతదేహాన్ని గాంధీకి తరలించారు. అక్కడి వైద్యులు వృద్ధుడి నమూనాలు పరీక్షలకు పంపించారు. వృద్ధుడి భార్య, కుమారుడిని హోం క్వారంటైన్లో ఉంచారు. - మంత్రి ఈటల