ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 133కు చేరిన కేసులు - కరోనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కొవిడ్ 19 పాజిటివ్ కేసులు 133కు చేరాయి. కొత్తగా వచ్చిన ఆరు కేసులు సంగారెడ్డి జిల్లాలో నమోదుకావటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేశారు.

తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 133కు చేరిన కేసులు
తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 133కు చేరిన కేసులు

By

Published : Apr 2, 2020, 3:51 PM IST

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆరుగురికి వైరస్ సోకింది. సంగారెడ్డిలో ఇద్దరు, అంగడిపేటలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జహీరాబాద్‌, కొండాపూర్‌లో ఒక్కొక్కరికి కరోనా సోకింది. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సంగారెడ్డిలో పర్యటించి... కలెక్టర్‌తో నియంత్రణ చర్యలపై సమీక్షించారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురు బాధితులను చికిత్స కోసం తరలించారు. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. కొత్తగా వచ్చిన ఆరుగురితో కలుపుకుని తెలంగాణలో కరోనా కేసులు 133కు చేరుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details