ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Auto stunts: ఆటోలతో ప్రమాదకర స్టంట్లు.. పోలీసుల అదుపులో ఆరుగురు డ్రైవర్లు - 6 men arrested

Auto stunts: హైదరాబాద్​లోని పాతబస్తీలో ఆటోలతో ప్రమాదకరంగా స్టంట్లు చేసిన పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి పూట రోడ్లపై హల్​చల్​ చేస్తూ.. వాహనదారులను భయబ్రాంతులకు గురిచేసిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

ఆటోలతో ప్రమాదకర స్టంట్లు
ఆటోలతో ప్రమాదకర స్టంట్లు

By

Published : Feb 27, 2022, 4:47 AM IST

Updated : Feb 27, 2022, 5:51 AM IST

Auto stunts: ఆటోలతో రోడ్డుపై స్టంట్లు చేస్తూ.. ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసిన ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24 అర్ధరాత్రి సమయంలో బాబానగర్ చాంద్రాయణగుట్ట రోడ్డుపై 3 ఆటోలు ప్రమాదకరంగా నడుపుతూ.. స్టంట్‌లు చేశారు.

ఆటో నెంబర్‌ల ఆధారంగా ఆటోలు నడిపిన ఏడుగురిని పోలీసులు గుర్తించారు. అందులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్​ ఇచ్చారు. అతివేగంతో నడుపుతూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తే.. చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించారు.

Last Updated : Feb 27, 2022, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details